CHIRANJEEVI:శ్రీలీల తో మెగాస్టార్ చిరంజీవి రొమాన్స్.. ఈ వయస్సు లో ఇవేం పనులు బాస్!

Posted by venditeravaartha, May 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినబడుతున్న పేరు ‘శ్రీ లీల’ ,శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరో గా నటించిన పెళ్లి సందడి సినిమా తో తెలుగు సినిమా కి పరిచయం అయినా ఈ ముద్దుగుమ్మ,వరుసగా స్టార్ హీరో ల తో నటిస్తూ ట్రేండింగ్ లో నిలుస్తుంది.ఇప్పుడు శ్రీ లీల సైన్ చేసిన సినిమా ల లిస్ట్ చూస్తే ఈమెకి ఎంత డిమాండ్ ఉందొ తెలుస్తుంది.అందం ,అభినయం కి తోడు డాన్స్ ఆమెకి ఉన్న పాజిటివ్.యువ హీరో లు అయినా విజయ్ దేవరకొండ,వైష్ణవ్ తేజ్,నితిన్,నవీన్ పోలిశెట్టి,రామ్ ల తో నటిస్తూనే సీనియర్ హీరో లు అయినా మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ ,బాలకృష్ణ ల తో సినిమా ల కు సైన్ చేసింది శ్రీ లీల.ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రీ లీల భాగం కానున్నారు అనేది సినీ ఇండస్ట్రీ లో వార్త,ఆ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది.మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే బంగారాజు సినిమా డైరెక్టర్ ‘కళ్యాణ్ కృష్ణ’ తో ఒక సినిమా రానుంది.ఈ సినిమా కి ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందిస్తుండగా,చిరంజీవి గారి పెద్ద అమ్మాయి సుష్మిత నిర్మాత గా వ్యవహరించనున్నారు.

చిరంజీవి గారు ప్రస్తుతం చేస్తున్న ‘భోళా శంకర్’ సినిమా పూర్తి అవ్వగానే బింబిసారా డైరెక్టర్ తో మరో సినిమా స్టార్ట్ చేయనున్నారు,ఆ సినిమా మరియు కళ్యాణ్ కృష్ణ తో సినిమా ఒకే సారి పట్టాలెక్కనుంది.ఈ సినిమా లో శ్రీ లీల హీరోయిన్ గా నటించనుంది,అయితే ఈ వార్త వచ్చిన మొదట్లో 21 సంవత్సరాల శ్రీ లీల తో 67 సంవత్సరాలు ఉన్న మెగాస్టార్ రొమాన్స్ ఏంటి అని ట్రోల్ల్స్ చేసారు కానీ నిజానికి ఈ సినిమా లో ‘డీజే టిల్లు’ ఫేమ్ ‘సిద్దు జొన్నల గడ్డ’ కూడా నటిస్తున్నారు ,అయన కి జోడి గా శ్రీ లీల కనిపించనున్నారు.మరి భోళా శంకర్ సినిమా తర్వాత ఇక అన్ని స్ట్రెయిట్ సినిమా లే తెస్తాను రీమేక్ లు చేయను అని చెప్పిన మెగాస్టార్ గారికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్టు ఇస్తుందో చూడాలి.

1968 views