Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవినా? మజాకా?

Posted by venditeravaartha, July 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆయనతో డాన్స్ చేయడం మా వల్ల కాదు.. ఆయనకు పోటీ మేము కాదు.. అంటూ సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు చెబుతూ ఉంటారు.. ఆరుపదల వయసు దాటిన కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తూ.. ఆకర్షిస్తూ.. అమితమైన వినోదాన్ని పంచుతూ ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే పడి చచ్చేవారు పురుషులే కాదు మహిళలకు కూడా ఉన్నారు.. ఆయన సినిమా స్టార్ట్ అయిందంటే రిలీజ్ అయ్యే వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసేవారు కోట్ల కొద్ది ఉన్నారు .

chiru

సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసిన చిరంజీవి సినిమాల్లో డాన్స్‌.. డైలాగ్ డెలివరీ.. లవ్ ఎమోషన్ అన్ని ప్రత్యేకమే. ముఖ్యంగా ఆయనతో డాన్స్ చేయాలంటే కొంత మంది హీరోయిన్లు భయపడిపోయేవారు. ఇప్పటికీ చిరులా డాన్స్ చేయడం మా వల్ల కాదు అని కొందరు చెబుతూ ఉంటారు. చిరు సైతం అదే మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ డాన్స్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే చిరు వయసు ఇప్పుడు 60 ఏళ్ళు దాటింది. కానీ అందరిలా తాను రిటైర్ అయి ఇంట్లో కూర్చోలేదు. యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తూ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా మంచి శరీరాకృతితో అలరిస్తున్నాడు.

chiranjeevi

సినీ ఇండస్ట్రీకి 8ఏళ్ళ గ్యాప్ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 15౦తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి లో నటించాడు. అయితే ఈ సమయంలో చిరు కాస్త లావయ్యారు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇది గమనించిన ఆయన తన ఫిజిక్ ను మార్చుకోవాలని అనుకున్నాడు. అప్పటి నుంచి ఫుల్ డైట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. దీంతో వాల్తేరు వీరయ్య సినిమా నుంచి చిరు స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఫుల్ డైటింగ్ చేస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించిన మెగాస్టార్ ప్రస్తుతం చాలా సన్నబడ్డారు. ఇప్పుడు చిరంజీవిని చూస్తే సుప్రీం హీరో గుర్తుకొస్తున్నారని కొందరు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. చిరు ఇలాగే మెయింటైన్ చేస్తే కొత్త కొత్త కథల్లో యంగ్ హీరోలా కనిపించే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు.

acharya

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ సినిమాలో నటించారు. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇందులో చిరున చూస్తే ఆశ్చర్యం వేస్తుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సాధారణంగా ఈ వయసులో ఎవరైనా కాస్త డల్ గా ఉంటారు. కానీ చిరు యాక్టివ్ గా ఉంటూ సినిమాలో కనిపించడం చూసి కొందరు నిర్మాతలు డైరెక్టర్లు షాక్ అయ్యారట. ఇక డాన్స్ మాస్టర్లు చెప్పే స్టెప్పులతో పాటు కొత్త స్టెప్పులను సైతం వేస్తూ వారిని ఇంప్రెస్ చేస్తున్నారు. వచ్చే సినిమాల్లో సైతం చిరు ఇలాగే ఫిజిక్ మెయింటైన్ చేస్తే మిగతా హీరోలకు పోటీ ఇవ్వడం ఖాయమని చర్చించుకుంటున్నారు.

1736 views