ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు గారు కడిగిన ముత్యం లా బయటకు వస్తారు-బొడ్డు

Posted by venditeravaartha, September 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహారదీక్ష చేపట్టిన రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొని తమ నిరసనను తెలిపారు. బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం లో పెద్ద ఎత్తున మహిళలు తమ సంఘీభావం తెలుపుతున్నారని రాష్ట్రంలో ఎలాంటి పాలనా నడుస్తుందో ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారని తొందరలోనే ప్రభుత్వానికి బుద్ది చెప్పడం కాయం అని తెలిపారు నియోజకవర్గం లో ఎక్కడ చుసిన అవినీతి మయం అవుతుంది అని తెలిపారు చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టిన అయన తప్పకుండ బయటకు వస్తారని అయన తెలిపారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు జీవించాలని, అక్రమ కేసులు నుండి కడిగిన ముత్యం లా బయట పడాలి అని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ భువనేశ్వరి గారు దర్శనం చేసుకోవడం జరిగింది. అన్నవరం విచ్చేసిన భువనేశ్వరి గార్ని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వరుపుల సత్య ప్రభ రాజా జిల్లా టీడీపీ పెద్దలతో కలిసి ఘనస్వాగతం పలికారు, అన్నవరం లో దైవ దర్శనం అనంతరం ఆల్ఫాహారం ముగించుకొని జగ్గంపేట లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద జరిగిన బహిరంగ సభలో భువనేశ్వరి గారు పాల్గొన్నారు. జగ్గంపేట సభలో శ్రీ నారా భువనేశ్వరి కామెంట్స్ …రాష్ట్రం కోసం కష్టపడటమే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పా,ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ ఆయన సింహంలా బయటకొచ్చి మళ్ళీ మీకోసం పని చేస్తారు ప్రజల సొమ్ము కోసం ఆశపడే కుటుంబం కాదు మాది. నా కంపెనీలో 2% షేర్ అమ్మినా 400 కోట్లు వస్తుంది. అలాంటి మాకు అవినీతి చేయాల్సిన పని లేదు.

Tags :
205 views