సినీ ఇండస్ట్రీ లో సహజీవనం అనేది చాలా కామన్ గా మారిపోయింది నచ్చిన వ్యక్తి తో లవ్, డేటింగ్ వంటి రిలేషన్ ను ఎక్కువగా గమనిస్తున్నాం ఇది ఒకప్పుడు బాలీవుడ్కే సొంతం అన్నట్లు ఉండేది తెలుగు వారి పై ఈ ప్రభావం తక్కువగా ఉండేది అయితే ప్రస్తుత కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా ఏమి లేదు సినీ ఇండస్ట్రీ వారు అందరూ ఇలానే ఉంటున్నారు అని తెలుస్తుంది ఇలా కొందరు వారికి నచ్చిన వ్యక్తితో నచ్చినట్లు ఉండి కొందరు వివాహం వరకు వెళ్లగా మరికొందరు మధ్యలోనే తమకు సెట్ అవ్వటం లేదు అనే రీసన్స్ తో విడిపోతున్నారు. అయితే ఇలా రిలేషన్ లో గర్భం దాల్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న జంటల్లో కొందరి గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ మొదటి భార్య రేణు దేశాయ్ కూడా పెళ్లికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది అయితే వీరిద్దరూ బద్రి చిత్రం తో దగ్గరయ్యారు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత వివాహం చేసుకున్నారు ఇంకో బిడ్డ జననం తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వలన విడిపోయారు.
అవును చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళ బ్యూటీ పూర్ణ ఒక వ్యాపారవేత్త అయినా శానీత్ ఆసిఫ్ అలీ ను 2022 అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకుంది 6 మంత్స్ కూడా గడవకుండానే ఏప్రిల్ నెలలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
తెలుగు లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఇలియానా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది కానీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఇప్పటికీ తెలుగు వారు సన్నగా అమ్మాయిలను ఇలియానా లా ఉన్నావు అంటూ పొగుడుతారు ఆ రేంజ్ లో ఇలియానా ఒకప్పుడు మెరిసింది. రీసెంట్గా తాను కూడా తల్లి కాబోతున్న అని వార్తను వెల్లడించింది అయితే తను కూడా పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
అదే విధముగా అలియా భట్ రణబీర్ కపూర్ కూడా పెళ్లికి ముందే రిలేషన్ లో ఉన్నారు అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చినప్పటికీ పెళ్లి అయినా తరువాత బయటపెట్టారు అనే సమాచారం ఉంది. వీరితో పాటు ఎవడు, రోబో 2.0 సినిమాల తో తెలుగు అభిమానులకు పరిచయం అయిన అమి జాక్సన్ మరియు దియా మిర్జా కల్కి కోచింగ్ నేహా దుపియా అమృత అరోరా వీరిది కూడా ఇదే పరిస్థితి అని సమాచారం.