Guess Who?:ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది..ఎవరో గుర్తుపట్టండి?

Posted by venditeravaartha, May 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Guess The Actress: గ్లామర్ రంగమైనటువంటి సినీ ఇండస్ట్రీ లో గ్లామర్ అత్యవసరం. దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు గ్లామర్ ఉన్న హీరోయిన్స్ కి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి పోటీ వాతావరణం లో అసలు అందంతో పని లేకుండా కేవలం నటనతో శబాష్ అనిపించుకుని ఇండస్ట్రీ లో కొనసాగుతున్న హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి అందం తో అసలు పని లేదు. అందం ఉన్నన్ని రోజులు మాత్రమే ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు వస్తుంటాయి. అదే నటన ఉంటే సగటు హీరోయిన్ కి చివరి శ్వాస వరకు సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉంటాయి. నటనతో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న హీరోయిన్స్ లో ఒకరు కామాక్షి భాస్కర్ల. ఈమె పొలిమేరల సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది కానీ, అంతకు ముందే అనేక సినిమాల్లో నటించింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా, నటనకి ప్రాధాన్యత ఉన్న ఏ పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగా ఉంటుంది కామాక్షి. ఇది ఇలా ఉండగా ఈ క్రింది ఫోటో లో కనిపిస్తున్నది ఆమెనే. చదువుకునే రోజుల్లో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటో అది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచినప్పటికంటే, అప్పట్లోనే ఎంతో క్యూట్ గా, అందం గా ఉంది కదూ!. కానీ సినిమాల్లో ఎందుకో ఆమె ఎప్పుడూ డీ – గ్లామర్ గానే కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఈ అమ్మడి అందాల ఆరబోత మామూలు రేంజ్ లో ఉండదు. చిన్న చిన్న దుస్తులు ధరించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కామాక్షి భవిష్యత్తులో ఏ రేంజ్ లో వెళ్తుందో, స్టార్ హీరోయిన్ అవుతుందా లేదా అనేది చూడాలి.

410 views