Chiru-Trisha: త్రిష కి తెలుగు లో బంపర్ ఆఫర్! మెగాస్టార్ తో జోడి..

Posted by venditeravaartha, June 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి 24 సంవత్సరాలు అవుతున్నా చెక్కు చెదరని అందం తో 40 సంవత్సరాల వయస్సు లో కూడా వరుస అవకాశాల తో బిజీ గా ఉన్నారు త్రిష,1999 లో జోడి సినిమా లో సిమ్రాన్ కి ఫ్రెండ్ గా కనిపించిన త్రిష(Trisha) ఆ తర్వాత విక్రమ్ తో సామి మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు.ఇక తెలుగు లో ప్రభాస్ తో కలిసి చేసిన వర్షం తో తెలుగు వాళ్ళ కి అభిమాన హీరోయిన్ గా మారిపోయారు.గత కొంత కాలంగా తెలుగు సినిమా ల కి దూరం గా ఉంటున్నా త్రిష.వరుసగా తమిళ ,మలయాళ సినిమా ల తో బిజీ గా ఉన్నారు.అయితే PS1 ,PS2 మూవీ ల లో తో త్రిష కెరీర్ గ్రాఫ్ ఒక్క సారిగా మారిపోయింది.విజయ్ తో లియో,మోహన్ లాల్ గారి రామ్ ,త్రిష సోలో ఫిలిం ది రోడ్ వంటి సినిమా ల తో బిజీ గా ఉన్నారు.

ps1

వరుస తమిళ ,మలయాళ సినిమా ల తో బిజీ గా ఉన్న త్రిష కి ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఆఫర్ లు భారీగా వస్తున్నాయి.మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన హీరోయిన్ గా త్రిష ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.చిరంజీవి గారు ప్రస్తుతం చేస్తున్నా భోళా శంకర్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు.ఈ సినిమా ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి గారు తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు అయినా కళ్యాణ్ కృష్ణ తో ఉంటుంది అని ఇది వరకే ప్రకటించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల స్క్రిప్ట్‌తో మెగాస్టార్‌ని ఆకట్టుకున్నాడు మరియు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

trisha chiru

త్రిష తన రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమా లు భారీ సక్సెస్ కావడం తో తన రెమ్యూనిరేషన్ కి పెంచేసింది.ఇక చిరంజీవి సినిమా కోసం కూడా భారీగానే రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు..ఇక
ఈ సినిమాలో టాలీవుడ్ యువ సంచలనం సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నారు ,సిద్ధూకి జోడీగా శ్రీలీల నటిస్తోందని వార్తలు వచ్చాయి. గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.2006 లో రిలీజ్ అయినా స్టాలిన్ మూవీ తర్వాత చిరంజీవి ,త్రిష కలయిక లో రానున్న ఈ సినిమా మీద భారీ అంచాలనే ఉన్నాయి.

stalin

 

2123 views