Pawan kalyan: పవన్ కళ్యాణ్ గారిని మించి పోయిన బ్రో మూవీ నిర్మాత క్రేజ్.

Posted by venditeravaartha, August 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా ప్రారంభం అవ్వాలి అంటే ముఖ్యమైన వ్యక్తి ప్రొడ్యూసర్ కానీ సినిమా వెనుక ఉండి డబ్బులు పెట్టి ,ప్రమోషన్ లు చేసి రిలీజ్ చేసే అతని ని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు .హీరో ,హీరోయిన్,డైరెక్టర్ ఇక ఆ సినిమా లో నటించిన కొంతమంది నటులు ని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు వారికే పేరు కూడా వస్తుంది.ఇక పెద్ద హీరో సినిమా అయితే డైరెక్టర్ ,హీరోయిన్ ల ని కూడా పట్టించుకోరు హీరో మీదనే ఫోకస్ ఉంటుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా సమయం లో అయితే ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు ఆయనకి ఉన్న క్రేజ్ అలాంటింది.కానీ ఆ స్థాయి లో పేరు మరియు క్రేజ్ ని సంపాదిస్తున్నారు ఆ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్.

people media factory

పవన్ కళ్యాణ్ గారిని తన పార్టీ ని ఆర్ధికంగా అణిచివేయాలని చూస్తున వైసీపీ వాళ్ళు మొదటి రోజు నుంచి నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తూ వారి వెబ్ సైట్ ల లో నెగటివ్ రివ్యూ లు ఇప్పించారు ,ఇక అంతటి తో ఆగకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం లో ఉన్న మంత్రులు బయట కి వచ్చి సినిమా ప్లాప్ ,డిసాస్టర్,కలెక్షన్స్ రావడం లేదు అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది.బ్రో సినిమా లో ఒక చిన్న సీన్ లో పృద్వి గారు నటించిన శ్యాంబాబు క్యారెక్టర్ తన ని పోలి ఉంది అని మినిస్టర్ అంబటి గారు తెగ హడావిడి చేస్తున్నారు,ఇక ఈ సినిమా కి ఫండింగ్ బయట నుంచి వచ్చింది అంటూ అర్ధం లేని ఆరోపణలు చేస్తూ మీడియా లో హల్చల్ చేస్తున్నారు.

bro

అంబటి రాంబాబు గారు చేసిన హల్చల్ వలన బ్రో మూవీ నిర్మాత ని కొన్ని టీవీ ఛానల్ లు
పిలిచి చేసిన ఇంటర్వ్యూ లు ఇప్పుడు చాల వైరల్ అవుతున్నాయి,అయితే ఇందులో ముఖ్యం గా కొన్ని వైసీపీ కి సంబందించిన టీవీ ఛానల్ లు టీజీ విశ్వ ప్రసాద్ ని ఇబ్బంది కలిగే ప్రశ్న లు అడిగి ఆయనను కార్నర్ చేయడానికి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా తాను ఎంతో తెలివి గా సమాధానాలు చెప్పారు ,పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనిరేషన్ ,సినిమా బడ్జెట్ ,కలెక్షన్ లు ల ను బయట ఎవరికీ కూడా చెప్పాల్సిన పని లేదు అని చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో సైతం సెన్సేషన్ గా మారాయి.ఈ ఇంటర్వ్యూ ల తో పవన్ కళ్యాణ్ గారితో పాటు గా తనకి కూడా మంచి గుర్తింపు తో పాటు బ్రో సినిమా కి ఫ్రీ ప్రమోషన్ దొరికినట్లు ఉంది.

ambati

1079 views