Chiranjeevi: ‘బోళా శంకర్’ స్విట్జర్లాండ్ పిక్స్ లీక్.. ఎవరు చేశారో తెలిస్తే షాకవుతారు.

Posted by venditeravaartha, May 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు. లాస్ట్ టైం నటించి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ ఊపులో ఉన్న ఈయన తన సినిమాల గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అయితే పవన్, చిరు సినిమాలు అనగానే లీకులు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాన్స్ లో జోష్ పెంచడానికి కొందరు చిరు సినిమా లోకేషన్ పిక్స్ బయటపెడుతూ ఉంటారు. లేటేస్టుగా భోళా శంకర్ కు సంబంధించి ఓ పిక్ బయటకొచ్చింది. స్విట్జర్లాండ్ లో తమన్నాతో కలిసి ఓ సాంగ్ ను చిత్రీకరించేందుకు ఇక్కడికి వెళ్లారట. ఇక్కడ సాంగ్ తీసే ముందు అంతా ఒక్కచోట కూర్చొని ఉన్నారు. అయితే ఈ లీక్ చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

bhola shnakr

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత చిరు ఎక్కువగా రీమేక్ చిత్రాలపై ఇంట్రెస్ట్ పెట్టారు. ఇదివరకు ఆయన తీసిన ‘గాడ్ ఫాదర్’ మూవీ సక్సెస్ కావడంతో మరోసారి తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్ లో నటిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మేకింగ్ అవుతున్న ఇందులో చిరుతో పాటు స్టార్ నటి కీర్తి సురేస్ నటిస్తోంది. ఈమె చిరంజీవికి చెల్లెలగా నటిస్తోంది. ఇక చిరు పక్కన తమన్నా నటిస్తోంది. చిరు, తమన్నా కాంబినేషన్లో ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’ లో వచ్చారు. మరోసారి ‘భోళా శంకర్’(bhola shankar)లో నటిస్తున్నారు.

chiru leaks

అయితే చిరు, తమన్నా(tamanna) ల మధ్య ఓ సాంగ్ తీసేందుకు యూనిట్ స్విట్జర్లాండ్ వెళ్లింది. అక్కడున్న అందమైన లోకేషన్లలో ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా సాంగ్ తీసే ముందు యూనిట్ సభ్యులంతా ఓ చోట కూర్చున్నారు. చిరంజీ మాత్రం కుర్చీలో ఉన్నారు. సాంగ్ కోసం మిగతా వారు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో చిరు నటించిన సినిమాల్లోని సాంగ్స్ ఎక్కువగా స్విట్జర్లాండ్ లో తీశారు.

song leaked

ఇక ఈ ఫొటో బయటకు రావడంతో మెగా ఫ్యాన్ష్ హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈ లీక్ ను కొందరు చిరు లీక్స్ అని యాష్ ట్యగ్ పెట్టారు. అంతేకాకుండా చిరంజీవి అకౌంట్ నుంచి లీక్ చేసినట్లుగా చెబుతున్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవినే ఈ ఫొటో బయటపెట్టినట్లు కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. అయితే చిరునే ఈ ఫొటో బయటపెట్టారా? లేక ఇతరులెవరైనా ఇలా పేరు మార్చి లీక్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

1356 views