సామాజిక సాధికార సభలో కనిపించిన ఖాళీ కుర్చీలతోనే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అర్థం అవుతుంది ఇంక జగన్ మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకోవడం ఎందుకు… డబ్బులు దండగ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుంది రాజానగరం నియోజకవర్గం లో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది.
సభ కోసం వారం నుంచి జనసమీకరణకు పూనుకున్నారు. వలంటీర్లు, ఉద్యోగులకు లక్ష్యాలు నిర్ధేశించారు. వాహనాలు ఏర్పాటు చేసి, మద్యం పంపిణీ చేసినా జనం రాలేదు. జనాన్ని రప్పించేందుకు రాజానగరం నియోజకవర్గంలోని మూడు మండలాలకు బస్సులు, వాహనాలను ఏర్పాటు చేయించారు. బస్సులలో జనం అరకొరగా వచ్చారు. ఒక్కో వలంటీర్ 20 మందిని సభకు తీసుకురావాలని హుకుం జారీ చేశారు.
మెప్మా ఆధ్వర్యంలో ఆర్‌పీలకు జనసమీకరణ బాధ్యతలను అప్పగించి. మహిళలను తరలించాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలను గ్రామీణ ప్రాంతాల నుంచి తరలించాలని చూశారు. ఏ ప్రయత్నమూ సఫలం కాకపోవడంతో ఆదివారం నాడు నిర్వహించిన సభ వెలవెలబోయింది.
ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి దళిత ద్రోహి అని రాష్ట్రంలో దళితు లపై జరుగుతున్న దాడు లకు లెక్కేలేదు దళిత యువత విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న సత్సంకల్పంతో చంద్రబాబు అమలు చేసిన పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేయడం దళిత యువతకు ద్రోహం చేయడం కాదా? అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పథకాలకు పెట్టుకోవడం జగన్ రెడ్డి దళిత వ్యతిరేకత కు నిదర్శనం కాదా? అంబేద్కర్ మహానీయుడి కంటే జగన్‌రెడ్డి గొప్పవాడా? అని అన్నారు ప్రపంచమేధావి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఎక్కడ? దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక తన భస్మాసుర హస్తం దళితులపైనే పెట్టి,వారిని అథ:పాతాళానికి తొక్కేశాడు. దళితుల పథకాలకు అంబేద్కర్ పేరు తీసేసి, తన పేరు పెట్టుకున్నప్పుడే జగన్ రెడ్డికి దళితులపై ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని అర్థమైంది. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చంపేసినప్పుడు దళిత మహిళ నాగమ్మను పులివెందులలో దారుణంగా హత్యాచారం చేసినప్పుడు స్పందించని ముఖ్యమంత్రి దళితుల రక్షకుడా? వైసీపీ ఎమ్మెల్సీ తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ని కిరాతకంగా చంపేసి, శవాన్ని ఇంటివద్ద పడేస్తే చలించని ముఖ్యమంత్రి.. తన పార్టీ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి దళితుల రక్షకుడా? తన పాలనలో దళితులపై దాదాపు 280కు పైగా దాడులు చేయించి, దళితుల్ని తన ఇనుపపాదాల కింద నలిపేస్తున్న జగన్మో హన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అదే దళితులు రాజకీయంగా పూడ్చిపెట్టడం ఖాయం అని తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అన్నారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని మంట గలిపి,జగన్‌రెడ్డి… తన సొంత సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు.నా ఎస్సీలు…నా ఎస్టీలు..నా బీసీ లు… నా మైనారిటీలు అనే నైతిక హక్కు జగన్‌రెడ్డికి.. అతని పార్టీకి, ప్రభుత్వానికి లేదన్నారు. పరిపాలన అంటే ఏమిటో జగన్‌రెడ్డికి తెలియదు. అధికారంలో ఉన్నానన్న అహంకారంతో జగన్‌రెడ్డి ప్రజాసంక్షేమా న్ని.. రాష్ట్రాభి వృద్ధిని పూర్తిగా విస్మరించాడు. ప్రజలు తనను ముఖ్య మంత్రిని చేసింది కేవలం దోపిడీ.. అవినీతి కోసమే అన్నట్టుగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నా డు.
2001 లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు అన్నారు. వీటి ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. వేల మందికి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. వైఎస్ వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయింది. నాడు అయేషా మీరా కేసులో సత్యం బాబు, నేడు కోడి కత్తి కేసు లో శ్రీను అనే ఇద్దరు దళిత యువకులను ఏళ్ల తరబడి జైల్లో మగ్గ పెట్టి వారి జీవితం నాశనం అయ్యేలా చేసింది ఈ జగన్ ప్రభుత్వం అని అన్నారు ‘దళిత బాంధవుడు-పేదల పాలిటి పెన్నిధి చంద్రన్న’ అని మేమంటాం. కాదనే ధైర్యం ప్రభుత్వంలోని దళిత మంత్రులకు, వైసీపీ దళితనేతలకు, మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డికి ఉందా? అని అన్నారు.
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బాలి అయ్యారని ఇలాంటిప్రభుత్వం లో సామజిక న్యాయం ఎక్కడ ఉంది అని అన్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బాలి అయ్యారని ఇలాంటిప్రభుత్వం లో సామజిక న్యాయం ఎక్కడ ఉంది అని అన్నారు. రాజానగరం నియోజకవర్గం లో దళితుడికి శిరోముండనం చేయించిన ఘనత వైసీపీకి దక్కుతుంది ప్రజలకు మేలు చేయలేని అసమర్ధ సీఎం వైస్ జగన్. జీవో నెంబర్ 3 కాపాడకుండా నమ్మక ద్రోహం చేసారు కాఫీ తోటల పెంపకం చేయాల్సిన ఏజన్సీ ని గంజాయి వనంగా చేసారు టిడిపి ఇచ్చిన రంజాన్ తోఫా రద్దు చేశాడు.జగన్ రెడ్డికి ముస్లింలే బుద్ధిచెప్పాలి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీల మోతలు.. కరెంట్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మద్యం ధరలు పెంచి సామాన్యుల జీవితాల్లో ఆడుకుంటున్న ఈ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు తప్పకుండ 2024 ఎన్నికల్లో బుద్ది చెప్పనున్నారు.