తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా,నిడదవోలులో పర్యటించిన బొడ్డు

Posted by venditeravaartha, December 22, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా, రూడా చైర్మన్‌, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గౌరవ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఈరోజు నిడదవోలులో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌, మాజీ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అయిన బూరుగుపల్లి శేషారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తనకు అందించిన మార్గనిర్దేశం, ప్రోత్సాహానికి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నిడదవోలు ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలుసుకుని, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ముఖ్యంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, నూతన జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :
318 views