Sandeep : సీరియల్ బ్యాచ్ కుట్రల వల్లే నేను బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాను – సందీప్ మాస్టర్

Posted by RR writings, November 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Sandeep : బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. ప్రస్తుతం తొమ్మిదో వారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు వరుసగా ఏడు వారాలు అమ్మాయిలే ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం సింగర్ దామిని, నాలుగోవారం రతిక, ఐదోవారం శుభ శ్రీ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన వాళ్లల్లో కూడా ఆరో వారం నయని పావని, ఏడో వారం పూజా ఎలిమినేట్ అయ్యారు. కానీ, ఎనిమిదో వారంలో ఈ సీజన్లో ఫస్ట్ టైం ఒక మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి టాప్ కంటెస్టెంట్ ఆట సందీప్. బిగ్ బాస్ 8వ వారం అనూహ్యంగా ఎవరూ ఊహించనివిధంగా ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఎలిమినేషన్‌కు ముందు ఆట సందీప్‌ను బీబీ టీమ్ అవమానించారని ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.

బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 28 శనివారం నాటి ఎపిసోడ్‌లో ఒక్కొక్కరి ఆట తీరుపై హోస్టు నాగార్జున రివ్యూ ఇచ్చాడు. అందులో భాగంగానే ఆట సందీప్‌ను లేపి బొంగులో డ్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అన్నాడు.. సందీప్ నువ్ డ్యాన్సర్‌వా.. కొరియోగ్రాఫర్‌వా అని అడిగితే.. రెండు అని సందీప్ సమాధానం ఇచ్చాడు. దానికి బొంగులో ఆన్సర్ ఇవ్వకు నాకు అంటూ నాగ్ ఫైర్ అయ్యాడు. నువ్ టైటిల్ గెలిచింది డ్యాన్సర్‌గానే కదా.. ఎందుకు అంత యాటిట్యూడ్ అంటూ నాగార్జున సందీప్ పై విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ స్టేజ్‌పై అందరి గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడిన ఆట సందీప్.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మాత్రం తనలోని మరో కోణాన్ని చూపించాడు. శివాజీ, అర్జున్‌లను ఏకిపారేశారు. టాప్ 3లో ఉండబోతున్నదెవరో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ 60 రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం అంటే చిన్న విషయమేమీ కాదు. టైటిల్ కొట్టాలనే వెళ్లాను. కానీ అన్నీ మనం అనుకున్నవన్నీ జరుగవు కదా అన్నారు.

నేను నామినేషన్స్‌లోకి రాకపోవడం.. ఫస్ట్ టైం నామినేషన్‌లోకి రావడం కూడా నా ఎలిమినేషన్‌కి కారణమంటూ చెప్పుకొచ్చారు. తాను డ్యాన్స్ షోలలో సీరియస్‌గా ఉంటానని గొడవలు పడతానని.. బిగ్ బాస్ హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడానని అనడంలో వాస్తవం లేదన్నాడు. తాను ఇంట్లో ఎలా ఉంటానో అలానే ఉన్నానంటూ సందీప్ చెప్పుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఫౌల్ గేమ్ ఆడాల్సి వచ్చింది. దానికి కారణం అమర్ దీప్. బడ్డీ టాస్క్‌లో తప్పు చేశాను. అమర్ ఇచ్చిన తుంటరి ఆలోచనల వల్లే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. బిగ్ బాస్‌లో ఇలాగే ఆడాలి. ఇలా ఆడితేనే ఉంటామని అమర్ చెప్పాడు అదే నా కొంపముంచింది. లెటర్ విషయంలో తను నాకు త్యాగం చేశాడు కాబట్టి.. నాకొచ్చిన కాయిన్స్ అమర్‌కి ఇచ్చేసి వచ్చాను. వాడికి చేయాల్సింది చేశాను తప్పితే.. సేఫ్ గేమ్ కాదని సందీప్ అన్నాడు. అర్జున్ విషయంలో సందీప్.. అర్జున్ నేను చాలా స్ట్రాంగ్ నా అంత హైట్ ఎవరూ లేరు.. నా అంత తోపు లేరు అని ఫీలవుతాడు. అతడికి అంత సీన్ లేదని బాంబు పేల్చాడు. శివాజీ తేనె పూసిన కత్తితో పోల్చాడు. మొత్తానికి సీరియల్ బ్యాచ్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

456 views