Big boss: బిగ్ బాస్ OTT 2 కంటెస్టెంట్లు వీరే.. ఎప్పుడు మొదలవుతుందంటే?

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇన్నాళ్లు సీరియళ్లు, సినిమాలు మాత్రమే ప్రసారమయ్యే టీవీల్లో ఇప్పుడు స్పెషల్ షో ల సందడి ఎక్కువైంది. ముఖ్యంగా ఆడియన్స్ ను కొత్త లోకంలోకి తీసుకెళ్లేందుకు ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ కు ప్రేక్షకులు పిదా అవుతున్నారు. బాలీవుడ్ టౌన్ లో మొదలైన ఈ రియాలీట షో తెలుగులోనూ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.7వ సీజన్ కు రెడీ అవుతోంది. అయితే కరోనా సమయంలో 24 గంటలు ప్రసారమయ్యేలా బిగ్ బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. దీనికి అక్కినేని నాగార్జున హోస్ట్ గా పనిచేశారు.

salman khan

బిగ్ బాస్ ఓటీటీ కూడా బీ టౌన్ నుంచే వచ్చింది. అక్కడి ఓటీటీ హోస్ట్ గా కరణ్ జోహార్(Karan johar) ఎంట్రీ ఇచ్చారు. ఆయన తన ప్రశ్నలు, డైలాగ్స్ తో ప్రేక్షకులను, కంటెస్టెంట్లకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. బిగ్ బాస్ ఓటీటీ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడిక రెండో సీజన్ కు రెడీ అవుతోంది. రెండో సీజన్ లో హోస్ట్ పర్సన్ మారారు. కరణ్ జోహార్ స్థానంలో సల్లూభాయ్ రంగంలోకి దిగాడు.

karan johar

రెగ్యులర్ బిగ్ బాస్ లో సల్మాన్ ఖాన్(Salman khan) కు ఇప్పటికే అనుభవం ఉంది. ఇప్పుడు ఓటీటీ సీజన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఓటీటీ బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ల గురించి అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా డిక్లేర్ చేయలదు. కానీ కొన్ని పేర్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. వీరిలో అంజలి అరోరా, జియా శంకర్, ఆదిత్య నారాయణ్, ఫైజల్ షేక్, జియాద్ దర్బార్, సంభావన సేథ్, పూజా గోర్, ఫహ్మన్ ఖాన్, అవేజ్ దర్బార్, మునావర్ ఫారుఖీ, రాజీవ్ సేన్, పూనం పాండే.. పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కంటెస్టెంట్లు ఎంత మంది హౌస్ లోకి వెళ్తారనేది జూన్ 17న తెలుస్తుంది.

bigg boss list

జూన్ 17నే ఓటీటీ బిగ్ బాస్ ప్రారంభం అవుతోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 గా దివ్వ అగర్వాల్ విన్నర్ గా నిలిచారు. తెలుగులోనూ నటినే టైటిల్ గెలుచుకుంది. ఓటీటీ ఫస్ట్ విజేతగా బిందుమాధవి నిలిచింది. నిత్యం హిందీ బిగ్ బాస్ ను ఫాలో అవుతున్న తెలుగు బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఈసారి అక్కినేని నాగర్జున(Nagarjuna) హోస్ట్ గా ఉంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

nagarjuna

729 views