Ali Reza: బిగ్ బాస్ వల్ల నా జీవితం సర్వనాశనం అయ్యింది అంటూ అలీ రెజా ఎమోషనల్ కామెంట్స్!

Posted by venditeravaartha, March 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Ali Reza : అలీ రెజా ఈ యాక్టర్ అందరికీ సుపరిచితమే, బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొని ఫైనలిస్ట్ గా నిలిచిన అలిరేజా ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనడం అంటే ఒక క్రేజ్, బిగ్ బాస్ షోలో పాటిస్పేట్ చేసిన చాలామంది, మంచి మంచి అవకాశాలను సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియా ఫాలోవర్స్ ని కూడా పెంచుకున్నారు. అలీ బుల్లితెర అవకాశాలతో పాటు వెండితెరలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తనను రెండేళ్లు బ్యాన్ చేశారని దానికి కారణం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన మనసులో బాధని బయట పెట్టాడు అలీ రెజా.

బుల్లితెర కండల వీరుడిగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు, సీరియల్స్ లోను సినిమాలతోనూ బిజీగా గడుపుతున్న హీరో అలీ, బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నాడు. నాగార్జున గారు మొదటిసారి హోస్ట్ చేసిన సీజన్ అది. ఈ సీజన్లో అలీ తన గేమ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అలాగే ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నాడు.కానీ బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తరువాత తనని బ్యాన్ చేశారని చెప్పాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలీ తన బాధను చెప్పుకుంటూ..బిగ్ బాస్ సీజన్ కి వెళ్లి వచ్చిన తర్వాత నాగార్జున గారు వైల్డ్ డాగ్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు యాక్షన్ సినిమా కావడంతో నేను రోజు ఫైటింగ్ సీన్స్ కి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అలా రెండు రోజులు పాటు సినిమాకి రాకపోతే సినిమాలో నుంచి తీసేస్తామని డైరెక్టర్ గారు ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు.

అదే రోజు సీరియల్ గురించి నాకు ఫోన్ వచ్చింది ఈ సీరియల్ ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మీరు వెంటనే రావాలి అని అన్నారు కానీ నేను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నానని ఇప్పుడు రావడం కుదరదని ఈవినింగ్ తర్వాత పర్మిషన్ పెట్టి వస్తానని, వాళ్లతో అలా డిస్కర్షన్ చేస్తుండగానే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి నాకు ఫోన్ వచ్చింది వాళ్లకు కూడా నేను అంతా వివరంగా నేనున్న పరిస్థితిని చెప్పాను. తర్వాత కౌన్సిల్ వాళ్ళు నాకు మీటింగ్ ఉందని రమ్మన్నారు ఇప్పుడు రావడం కుదరదు ఈవినింగ్ వస్తానని చెప్పాను. వాళ్ళు వినిపించుకోకుండా నన్ను బలవంతంగా మీటింగ్ కు రమ్మన్నారు. కొంతసేపటి తర్వాత నన్ను వాళ్ళు బ్యాన్ చేస్తున్నట్టు మెసేజ్ పంపించారు.దాంతో నేను చాలా బాధపడ్డాను అని చెప్పాడు. రెండేళ్ల పాటు, ఎవ్వరు షూటింగులకు పిలవకూడదని ఏ షోకి పిలవకూడదు అని రాసి ఉంది. అది చదివిన తర్వాత అసలు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారని చాలా బాధపడ్డాను. రెండు సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్లకుండా నన్ను బ్యాన్ చేయడం చాలా బాధేసింది అని, తను ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా చేశారని అలీరెజా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం కొన్ని సినిమా అవకాశాలు సీరియల్, వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయట నటుడిగా తను ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలీ. అప్పట్లో ఓ సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అలీతో పాటు పసుపు కుంకుమ సీరియల్ లో నటి అయినా పల్లవి గౌడ మీద కూడా బ్యాన్ విధించారు అయితే ఆ బ్యాన్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆమె రీఎంట్రీ ఇచ్చి అదే, చానల్లో మళ్లీ సీరియల్స్ చేస్తూ బిజీ అయిపోయారుట. అలీ కూడా మంచి సీరియల్స్ లో సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :
310 views