Amardeep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రస్తుతం టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే ఆసక్తికరంగా సాగుతోంది. బుల్లితెర ప్రేక్షకుల ఆదరణతో ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుంది. ఇక 11వ వారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నిలిచారు. గత వారం ఐదుగురు నామినేషన్ల జాబితాలో ఉంటే ఈ వారం మాత్రం ఏకంగా ఎనిమిది మంది నామినేషన్లలోకి వచ్చారు. శోభావెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరి, రతికా రోజ్, ప్రిన్స్ యావర్, అశ్విని శ్రీ, గౌతమ్ కృష్ణలు 11 వారం నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. నామినేషన్స్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ వారం ఓటింగ్ కూడా భారీగానే జరుగుతోంది. ఇక్కడ ప్రిన్స్ యావర్ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. సుమారు 34 శాతం ఓట్లు అతనికే పడ్డాయి.
ఇక 11 వారం ఓటింగ్‌లో అమర్ దీప్ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 20 శాతం ఓట్లు పోలయ్యాయి. 13 శాతం ఓట్లతో రతికా రోజ్ మూడో స్థానంలో ఉండగా, 8 శాతం ఓట్లతో అశ్విని నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నిన్నటి వరకు అట్టడుగున ఉన్న ప్రియాంక జైన్ ఇప్పుడు ఐదో ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఆమెకు 6.8 శాతం ఓట్లు పడ్డాయి. అలాగే హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న అర్జున్ 6.1 శాతం ఓట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే గౌతమ్ కృష్ణ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక కేవలం 4 శాతం ఓట్లతో మోనితా శోభాశెట్టి లాస్ట్ పొజిషన్లో కొనసాగుతోంది. ప్రస్తుతం గౌతమ్, శోభా శెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నారన్నమాట.
ఇది ఇలా ఉంటే అమర్ దీప్ 14వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. గెలవాలనే కసి, తపన తనకు చాలా ఎక్కువ అన్న సంగతి చూస్తున్న ప్రేక్షకులకు అర్థం అవుతూనే ఉంటుంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే.. ఓడిపోవడానికి ఇష్టపడడు అమర్ దీప్. గెలిచివస్తానని తన భార్య తేజుతో చెప్పాడు. దీంతో విజయం పై అతడు చాలా ధీమాగా ఉన్నాడు. అతడు తన కెరీర్ మొదట్లో యూట్యూబ్ ఛానల్ నెలకి రూ.25 వేల జీతానికి పనిచేశాడు. ఆ తరువాత ‘శైలజా రెడ్డి’ సినిమాలో చిన్న పాత్ర చేశాడు. కాకపోతే ఆ సీన్‌లు ఎడిటింగ్‌లో లేపేశారు. తరువాత ‘సిరిసిరిమువ్వలు’ సీరియల్‌కు నెలకు రూ.80 వేలు జీతానికి నటించాడు. ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరోగా అమర్ దీప్ చౌదరి భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌసులో తనకు వారానికి రూ.3లక్షల మేర చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.