Priyanka Jain: కిడ్నాప్ కి గురైన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్.. వైరల్ అవుతున్న వీడియో!

Posted by venditeravaartha, July 29, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Priyanka Jain : స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా అమర్ దీప్, ప్రియాంక జైన్ ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు. ఈ సీరియల్ అయిపోయిన వెంటనే వీళ్లిద్దరు బిగ్ బాస్ రియాలిటీ షో కి రావడం, ఇద్దరు తమకి ఉన్న క్రేజ్ ని పదింతలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ షో నుండి బయటకి వచ్చిన తర్వాత ప్రియాంక జైన్ జాతకమే మారిపోతుంది, వరుసగా క్రేజీ సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమె కేవలం తన యూట్యూబ్ ఛానల్ కి మాత్రమే పరిమితం అయ్యింది. యూట్యూబ్ లో ఈమెకి నెవెర్ ఎండింగ్ టేల్స్ అని ఒక ఛానల్ ఉంది. ఈ ఛానల్ లో ఈమె ప్రాంక్ వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి పెడితే సరదా అనుకోవచ్చు. కానీ ఈమె ప్రతీ వారం అదేపనిగా పెడుతూనే ఉంటుంది. ఆమె అభిమానులకు ఇవి చూసేందుకు ఎంటర్టైన్ గానే ఉంటుంది కానీ, మిగిలిన ప్రేక్షకులు మాత్రం చిరాకుగా ఈమె వీడియోస్ క్రింద కామెంట్స్ పెడుతున్నారు, అయినా కూడా ఆమె ఇలాంటి వీడియోస్ పెట్టడం ఆపడం లేదు. ప్రాంక్ వీడియోస్ నిజంగా చేస్తే బాగానే ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా యూట్యూబర్లు చేసేవే ఇవి.

కానీ ఈమె చేసే ప్రతీ ప్రాంక్ కూడా స్క్రిప్టెడ్ లాగ అనిపిస్తుంది. రీసెంట్ గా ఈమె కాబోయే భర్త శివ ప్రియాంక ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తున్నట్టు నటించాడు. ఈ ప్రాంక్ ని ఆమె నమ్మినట్టు, భయపడినట్టు బాగానే నటించింది కానీ, అది కేవలం నటన మాత్రమే అని ఆడియన్స్ పసిగట్టేసారు. దీంతో ఆ వీడియో క్రింద అంత ఖాళీగా ఉంటే వేరే ఏదైనా పని చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మమ్మల్ని ఎందుకు వేధిస్తారు అని కామెంట్ చేస్తున్నారు. వారం రోజుల క్రితం అప్లోడ్ చేసిన ఈ ప్రాంక్ వీడియో కి మూడు లక్షల వ్యూస్ వచ్చాయి.

యూట్యూబ్ లో వీడియోస్ కి వ్యూస్ వస్తే భారీ స్థాయిలో డబ్బులు ఇస్తారనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే ప్రియాంక ఇలా వీడియోస్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమెకి ఎలాంటి సినిమాలు, సీరియల్స్ లేకపోయినా లేటెస్ట్ గా ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ ప్రోగ్రాం లో ఒక కంటెస్టెంట్ గా చేస్తుంది. ఈ షో కి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.

616 views