Bichagadu2: బిచ్చగాడు 2 మూవీ రివ్యూ!

Posted by venditeravaartha, May 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కథ లో విషయం ఉంటె టైటిల్ ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ప్రూవ్ చేసిన సినిమా 2016 లో రిలీజ్ అయినా బిచ్చగాడు..తమిళ్ లో పిచ్చైకారన్(Pichaikkaran) గా రిలీజ్ అయినా ఈ సినిమా అక్కడ బ్లక్ బస్టర్ సాధించింది తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఈ సినిమా కి మంచి కలెక్షన్ వచ్చాయి.మొదట్లో ఈ సినిమా పేరు చూసి ట్రోల్ల్స్ చేసిన వారే సినిమా చూసి మెచ్చుకునే స్థాయి కి వెల్లింది బిచ్చగాడు(Bichagadu).ఈ సినిమా కి ఉన్న క్రేజ్ కి ఇప్పుడు దీనికి సీక్వెల్ వచ్చింది.బిచ్చగాడు 2 ని విజయ్ ఆంటోనీ(Vijay antony) ఏ డైరెక్షన్ చేసాడు.మే 19 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి పార్ట్ రేంజ్ ని అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ: విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ ) ప్రపంచం లోనే అత్యంత ధనవంతుల లో ఒకరు మన భారత దేశం లో ఉన్న ధనవంతుల జాబితా లో 7 వ స్థానం లో ఉంటారు.అయితే ఆయన పక్కన ఉన్నవారే తన మీద కుట్రలు ,పన్నాగాలు పొందుతుంటారు. సినిమా మొదటి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉంటుంది విజయ్ గురుమూర్తి సత్య నుండి బ్రెయిన్ ఇంప్లాంటేషన్ ద్వారా వెళ్ళాడు. సత్యకి ఫ్లాష్ బ్యాక్ కథ ఉంది. విజయ్ గురుమూర్తి సత్యలా ఆలోచించడం మొదలుపెడతాడు.మొదటి భాగం మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఉంటుంది.ఇక సెకండ్ హాఫ్ లో సిస్టర్ సెంటిమెంట్ ,బ్రెయిన్ ట్రాన్స్ఫలేంటేషన్ ల తో ముందుకు వెల్తుంది.విజయ్ గురుమూర్తి బ్రెయిన్ మార్పిడి ఎందుకు చేసుకోవాలి అనుకున్నాడు తాను ఎంచుకున్న సత్య కి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:బిచ్చగాడు సినిమా లో తన తల్లి ఆరోగ్యం ,ప్రాణం కోసం తన ఆస్తులు ల ను అన్ని పక్కన పెట్టి బిచ్చగాడు లా మారిన విజయ్ తన తల్లి ని కాపాడుకుంటాడు.అయితే బిచ్చగాడు 2 లో మాత్రం సిస్టర్ సెంటిమెంట్ ని చూపించారు.బిచ్చగాడు 2 మొదటి సగం ప్రేక్షకులను కట్టిపడేసే థ్రిల్లర్ అంశాలను కలిగి ఉంది. లిప్ సింక్ మిస్ కావడం అనేది బాధించే అంశం. మొదటి సగం ఆసక్తికరమైన ట్విస్ట్‌తో ముగుస్తుంది.విజయ్ ఆంటోనీ అందించిన సంగీతం అలరిస్తుంది.ఇక డూప్ లేకుండా చేసిన పోరాట సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయి అనే చెప్పాలి.ఫస్ట్ హాఫ్ వరకు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో అందర్నీ కట్టిపెసిన బిచ్చగాడు 2 సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ ,పాలిటిక్స్ ,ఎమోషన్స్ తో ముగించారు.

పాజిటివ్:కథ ,స్క్రీన్ ప్లే,ట్విస్ట్ లు ,ఫైట్స్,సిస్టర్ సెంటిమెంట్.
నెగటివ్:డబ్బింగ్ సరిగా లేదు,సెకండ్ హాఫ్.
రేటింగ్:4 / 5
చివరిగా బిచ్చగాడు 2 సైన్స్ ,ఎమోషన్ కలగలిసిన థ్రిల్లర్.తప్పకుండ చూడలిసిన సినిమా.

3441 views