Bhagavanth Kesari : పాజిటివ్ టాక్ తో ‘భగవంత్ కేసరి’ కి వచ్చిన చిల్లర వసూళ్లు చూస్తే నోరెళ్లబెడుతారు..పాపం బాలయ్య!

Posted by venditeravaartha, October 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Bhagavanth Kesari: నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భగవంత్ కేసరి చిత్రం ఎట్టకేలకు గురువారం విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో వచ్చయో లేదో చూద్దాం. బాలయ్య బాబు సరికొత్త అవతారంలో నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 19(గురువారం)న విడుదలైన సినిమా తొలిరోజు ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

దీంతో మంచి కలెక్షన్లు రాబట్టే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి నటసింహం రేంజ్ కు తగ్గట్లే థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అందులో నిజాం నుంచి రూ. 14. 50 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ. 5 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరు నుంచి రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరు నుంచి రూ. 2.6 కోట్లు. అలాగే కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్ రూ. 6 కోట్ల వ్యాపారం జరిగిందట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది భగవంత్ కేసరి సినిమా.

ఈ సినిమా రూ. 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1350 థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. వీర సింహారెడ్డి సినిమాతో పోలిస్తే భగవంత్ కేసరి సినిమా బుకింగ్స్ చాలా నెమ్మదిగా మొదలయ్యాయి. మొత్తం రూ. రేంజ్ లో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బుక్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి సినిమా బుకింగ్స్ ప్రకారం తొలిరోజు రూ. 18 నుంచి 20 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గ్రాస్ వసూళ్లు దాటిపోవడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే బాలయ్య కెరీర్లో ‘వీరసింహారెడ్డి’ మొదటి రోజు రూ.29 కోట్ల షేర్ రాబట్టి బాలయ్య కెరీర్లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా పోటీ ఉంటుంది. మరి రానున్న రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉండనున్నాయో చూడాలి మరి.

248 views