Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ మూవీ ఫుల్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Posted by venditeravaartha, October 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Bhagavanth Kesari: అఖండ మరియు వీర సింహా రెడ్డి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తో ఏ సీనియర్ హీరో కూడా లేనంత పీక్ ఫామ్ ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య, కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని అనిల్ రావిపూడి తో కలిసి చేసిన చిత్రం ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari). టీజర్ , ట్రైలర్ మరియు పాటలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం విడుదలకు ముందు అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ మూవీ ప్రొమోషన్స్ లో కూడా యూనిట్ మొత్తం ఎంతో నమ్మకంతో ఉండడం వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకుండా లేదా?, బాలయ్య బాబు (Balayya)ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టా లేనట్టా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :

తెలంగాణలోని నెలకొండా అనే మారుమూల గ్రామానికి చెందిన కేసరి రైతు కూతురే తన ప్రాణం గా బ్రతుకుతూ ఉంటాడు. అయితే అనుకోని కొన్ని కారణాల వల్ల అతను జైలు జీవితం గడపాల్సి వస్తుంది. జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత తన కూతురిని ఎలా అయినా ఆర్మీ కి పంపించి జవాన్ ని చెయ్యాలని కోరుకుంటాడు. కానీ ఆయన కూతురుకి అందరి ఆడపిల్లలు లాగ సాధారణమైన జీవితం గడపాలని కోరుకుంటుంది. కానీ కేసరి ఒప్పుకోడు, బలవంతంగా తన కూతుర్ని ఆర్మీ లో చేర్పించి ట్రైనింగ్ ఇప్పిస్తాడు. తప్పించుకోవాలని ఆయన కూతురు ఎన్ని ప్రయత్నాలు చేసిన కేసరి ఒప్పుకోడు. పట్టువదలని విక్రమార్కుడు లాగ కూతురి చేత ఆర్మీ ట్రైనింగ్ చేయిస్తూ ఉంటాడు. తనని ఇంతలా హింసిస్తున్న తండ్రి పై చిన్నగా ద్వేషం పెంచుకోవడం ప్రారంభిస్తుంది. అలా కథ సాగుతూ ఉండగా కూతురి జీవితం లో కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. ఆ సమస్యల నుండి కేసరి తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు. చివరికి తన కూతుర్ని జవాన్ ని చేశాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే చాలు, ఆడియన్స్ ఈమధ్య సినిమాలను నెత్తిన పెట్టుకొని మరీ చూసుకుంటున్నారు. రీసెంట్ గా అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’ చిత్రం కూడా అలాంటిదే. కానీ దర్శకుడు వినోదాత్మకంగా చెప్పిన తీరు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం టైం పాస్ అయిపోతుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు, బాలయ్య మార్క్ ఇంట్రడక్షన్ ఫైట్స్ మరియు యాక్షన్ బ్లాక్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. అనిల్ రావిపూడి ఈసారి ఎక్కువగా కామెడీ మీద ఫోకస్ చెయ్యకుండా, సెంటిమెంట్ మీదనే ద్రుష్టి పెట్టాడు, అవి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. వార్నింగ్ సన్నివేశం నుండి ఇంటర్వెల్ సన్నివేశం వరకు సినిమా ఫస్ట్ హాఫ్ ఉరకలు వేస్తాది. సెకండ్ హాఫ్ కి మంచి గ్రౌండ్ ని సెట్ చేసి పెట్టింది ఫస్ట్ హాఫ్.

ఇక సెకండ్ హాఫ్ కూడా ఇంతే, మంచి యాక్షన్ బ్లాక్స్ తో ప్రారంభం అవుతుంది. అలా చివరి వరకు మాస్ కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా రొటీన్ గా అనిపిస్తాది. ఇక పోతే బాలయ్య బాబు భగవంత్ కేసరి పాత్రలో నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ బాగా సెట్ అయ్యాయి, శ్రీలీల కి ఈ సినిమాలో నటించేందుకు మంచి స్కోప్ దొరికింది. ఇలాంటి క్యారెక్టర్స్ హీరోయిన్స్ కి రావడం చాలా అరుదు, కానీ శ్రీలీల కి కెరీర్ ప్రారంభం లోనే రావడం విశేషం. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది అనే చెప్పాలి. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ లో చూస్తే చాలా సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన రోమాలను నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఓవరాల్ గా చాలా కాలం తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమాని చూసిన అనుభూతిని మిగిలించింది ఈ చిత్రం.

రేటింగ్ : 2.75/5

901 views