Barrelakka: వైరల్ అవుతున్న బర్రెలక్క పెళ్లి కార్డు..పెళ్లి కొడుకు ఎవరో మీరే చూడండి!

Posted by venditeravaartha, March 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Barrelakka: తెలంగాణలో బర్రెలక్కవో సంచలనం రాజకీయాల్లోకి వచ్చిన బర్రెలక్క అలియాస్ శిరీష త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడున్నారు. సోషల్ మీడియాలో వీడియో లు పోస్ట్ చేస్తూ యువతను తన ఆలోచనల వైపు మళ్ళించారు బరలక్క ఒక వీడియోతో అందరిని తన వైపు తిప్పుకున్నారని చెప్పొచ్చు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిలుచుంటున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బర్రె లెక్కగా బర్రెలు తోలుకుంటూ వీడియో చేసి సరదాగా అప్లోడ్ చేస్తే విపరీతమైన ఫాన్స్ పెరిగి తను ఒక రాజకీయ నాయకురాలిగా మారడానికి ప్రోద్భవించిన ఫ్యాన్స్ కి ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది శిరీష.

బర్రెలు కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమొలి వస్తాయి తప్ప జాబులు అయితే వస్తలేదు నోటిఫికేషన్ రావు అందుకే మా అమ్మని అడిగి ఈ బర్రెలు కొనుక్కున్నాను అని వీడియోలో అందరికీ సరదాగా పోస్ట్ చేసింది అది తర్వాత సెన్సేషన్ గా మారి బర్రెలకు కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది నిరుద్యోగుల గొంతుగా నిలిచింది కోలహాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే వరకు ఫ్యాన్స్ తీసుకెళ్లారు.

ఎన్నికలకు జరిగేటప్పుడు బర్రేలక్క చాలా ఎదురు దెబ్బలు తగిలాయి ప్రతి దెబ్బను తట్టుకొని నిలబడింది కొంతమంది బెదిరించారు అవి కూడా బెదరకుండా ఎన్నికల్లో నిలబడి ఆమె తెగింపు ఇప్పటికీ కొంతమంది చెప్పుకుంటూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చాలామంది ఆమెకి సపోర్ట్ చేయడం కొంతమంది ఆమెకి డబ్బు పంపించారని కొంతమంది ఆమెకి సపోర్ట్ గా నిలబడడానికి తోడ్పడుతున్నారని అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి కానీ ఏది ఏమైనా ఎన్నికల్లో బర్రెలక్క నిలబడి తను ఓడిపోయినా కూడా మళ్ళీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం విశేషం. కొంతమంది ఆమెను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె డబ్బుకు అమ్ముడుపోయిందని అక్కడ నిలబడిన ప్రత్యర్థులు కూడా ఆమెను అనడంతో ఆమె చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా తక్కువ స్థాయి నుండి వచ్చిన ఆ అమ్మాయి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పే వరకు ఉండే తెగింపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.

ఇప్పుడు ఈ శిరీష పెళ్లి పీటలు ఎక్కడ ఉన్నారు సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలను పోస్టులను ఎప్పటికప్పుడు ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అప్పట్లో బిగ్బాస్ ఫేమ్ రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్ ఈమెకి పెళ్లి అంటూ వార్తలు కూడా వచ్చాయి కానీ వాటిని శిరీష కొట్టి పడేసింది. తమకు అటువంటి ఆలోచన లేదని స్వయంగా తానే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది తరువాత ఈమె పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింటి వైరల్ గా మారుతున్నాయి పెళ్లి చూపుల వీడియో నిశ్చితార్థం వీడియో కట్ణ కానుకలు మాట్లాడుకునే వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు శిరీష ఇప్పుడు తాజాగా బర్రెలకు వెడ్డింగ్ కార్డు కూడా పోస్ట్ చేశారు మార్చిలో ఈమె పెళ్లి జరగనుందని ఈ కార్డు ద్వారా మనకు తెలుస్తుంది వరుడి పేరు వెంకటేష్ గా ఈ కార్డులో మనం చూడొచ్చు. రానున్న గురువారం మార్చి 8న శిరీష వివాహం జరగనుంది. పెళ్లి పెద్దలు ఇచ్చిన పెళ్లిగా చెబుతున్నారు ఈ పెళ్లి పెద్దపల్లి వేదికగా జరగనుంది. మరి పెళ్లి తర్వాత ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తారా ఎంపీగా తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని నిలబడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన బర్రెలక్క అలియాస్ శిరీష కు మనము శుభాకాంక్షలు తెలుపుదాం.

Tags :
1019 views