BANDLA GANESH: వైసీపీ పార్టీ లో చేరబోతున్న బండ్ల గణేష్..సంచలనం రేపుతున్న లేటెస్ట్ ట్వీట్స్

Posted by venditeravaartha, May 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అతిగా భజన చేసే వాళ్ళని అసలు నమ్మకూడదు అని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే మొట్టమొదట వెన్నుపోటు పొడిచేది వాడే. ఇది ఎక్కువగా మనం రాజకీయాల్లో చూసి ఉంటాము, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విషయాల్లో ఇది బాగా జరుగుతున్నాయి. ప్రాణ స్నేహితుడు అనుకున్న కమెడియన్ అలీ , వైసీపీ పార్టీ లో చేరి పవన్ కళ్యాణ్ మీదనే పోటీ చేస్తాను అంటూ సవాలు విసురుతున్నాడు.సోల్ మేట్స్ అని చెప్పుకొని తిరిగే కోనవెంకట్ లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వ్యతిరేక పార్టీ కి జై కొట్టి, ఆయన పై విమర్శలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఆ జాబితాలోకి ఎంట్రీ ఇవ్వడానికి దూసుకొస్తున్నాడు బండ్ల గణేష్. నిన్న మొన్నటి వరకు రెండు చక్కలు తీసుకొని, పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ చెక్క భజన చేసిన ఈయన , త్వరలోనే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

లేటెస్ట్ గా ఆయన వేసిన ట్వీట్స్ చూస్తూ ఉంటే అలాగే ఉన్నాయి మరి. ఆయన ఏమి మాట్లాడాడు అంటే ‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం ప్రకటించబోతున్నాను, ఇక నా బానిసత్వానికి సంకెళ్లు తెంచుకున్నాయి,ఇక నుండి నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా, బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై’ అంటూ ఒక ట్వీట్స్ వేసాడు.ఇక నాకు రాజకీయాలు ఒద్దు బాబోయ్ అంటూ గతం లో కామెంట్స్ చేసిన ఈయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పడం ఒక ఎత్తు అయితే , ఈ ట్వీట్స్ సరిగ్గా నేడు పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగిసిన వెంటనే వెయ్యడం మరొక ఎత్తు. ఇదంతా చూస్తూ ఉంటే ఆయన త్వరలోనే వైసీపీ పార్టీ లో చేరబోతున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి.

బండ్ల గణేష్ ఈమధ్య గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్లు వెయ్యడం ప్రారంభించాడు. ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్క స్టార్ హీరో ని పొగుడుతూ ట్వీట్స్ వేస్తున్నాడు కానీ, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ యానివెర్సరీ వచ్చినా కూడా స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఈ సినిమా లేకపోతే అసలు బండ్ల గణేష్ అనేవాడు ఇండస్ట్రీ లో ఉండేవాడు కాదనే విషయం ఆయనకి కూడా తెలుసు. నన్ను ఇండస్ట్రీ లో లో నిర్మాతగా నిలబెట్టిన పవన్ కళ్యాణ్ నాకు దేవుడితో సమానం అంటూ ఒకప్పుడు మైక్ దొరికితే ఊదరగొట్టేసేవాడు.అలాంటి బండ్ల గణేష్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉంటుంది అని ఎవరైనా గమనించారా. ఇది పోకిరి రేంజ్ ట్విస్ట్ అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై సెటైర్లు విసురుతున్నారు.

502 views