Balakrishna: 100 కోట్ల బడ్జెట్ తో బాలయ్య ఛంగీజ్ ఖాన్ మూవీ ! అసలు ఎవరు ఈ ఛంగీజ్ ఖాన్..

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరో ల లో మంచి సక్సెస్ తో ఉన్న హీరో..తన కెరీర్ లో పీక్ టైం లో ఉన్న బాలకృష్ణ గారు వరుసగా సినిమా లు చేస్తూ జోరు మీద ఉన్నారు..అఖండ ,వీర సింహ రెడ్డి ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్న బాలయ్య తన తుదపరి చిత్రాలను బోయపాటి శీను ,బాబీ మరియు ప్రశాంత్ వర్మ ల తో ప్లాన్ చేసుకుని ఉన్నారు.అయితే ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కావడానికి దాదాపు సంవత్సరం పైన సమయం పడుతుంది.ఇక అదే సమయం లో ఎలక్షన్స్ కూడా ఉండటం తో ఈ లోపే ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

nbk

ఇండస్ట్రీ లో ఉన్న సమాచారం ప్రకారం బాలకృష్ణ గారికి ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలి అని కోరిక ఉంది అంట.అయితే దానికి తగ్గట్లు గా కథ ని మాత్రం ఇంత వరకు ఎవరు రెడీ చేయకపోవడం తో ఆ ప్రాజెక్ట్ ని లేట్ చేస్తూ వచ్చిన బాలయ్య ఇప్పుడు ఎలా అయినా చేయాలి అని పట్టు పట్టినట్లు తెలుస్తుంది.14 వ సెంచరీ కి చెందిన ఛంగీజ్ ఖాన్ యొక్క కథ ని సినిమా గా చేయాలి అనేది బాలయ్య బాబు గారి కోరిక.అయితే ఈ సినిమా కి ప్రొడ్యూసర్ రెడీ గా ఉన్నపటికీ స్టోరీ ని ఇంకా రెడీ చేయలేదు అంట.బాలయ్య బాబు ఇప్పుడు ఒకే అనడం తో తెలుగు లో స్టార్ రైటర్స్ ని కూర్చోబెట్టి కథ సిద్ధం చేస్తున్నారట..

balaya with anilravipudi

బాలయ్య బాబు అంతగా ఇష్టపడి చేయాలి అనుకుంటున్న ఆ ఛంగీజ్ ఖాన్ ఎవరో కాదు..
మంగోల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు మరియు మొదటి ఖగన్, ఇది తరువాత చరిత్రలో అతిపెద్ద భూ సామ్రాజ్యంగా మారింది. మంగోల్ తెగలను ఏకం చేయడానికి తన జీవితంలో ఎక్కువ భాగం గడిపిన అతను చైనా మరియు మధ్య ఆసియాలోని పెద్ద భాగాలను స్వాధీనం చేసుకున్న సైనిక ప్రచారాల శ్రేణిని ప్రారంభించాడు.బహు బుద్ధిశాలి మరియు బలవంతుడు అయినా ఛంగీజ్ ఖాన్ యొక్క చరిత్ర ని సినిమా గా తీస్తే బాలయ్య బాబు పాన్ ఇండియన్ లెవెల్ లో భారీ హిట్ కొట్టడం పక్కా గా జరుగుతుంది.

balakrishna as changeej khan

1182 views