Balakrishna : బాలకృష్ణ పెళ్లి పత్రిక చూశారా.. ఇంతకీ వాళ్ల పెళ్లి ఎక్కడ జరిగిందంటే ?

Posted by RR writings, February 27, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Balakrishna : నందమూరి తారక రామారావు వారసుడిగా నటసింహం బాలకృష్ణ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తన నటనతో, డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ హీరో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. జనం ఊగిపోతారు. ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుంటారు.

అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్, ఆ తర్వాత మాస్ ఆడియన్స్ ను అలరించాడు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో బాలయ్య అభిమానులను ఆనందపరిచారు. ప్రస్తుతం హీరో కొడుకు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్ మీదున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. అంతకు ముందు అఖండతో భారీ విజయం సాధించాడు. అలా బాలకృష్ణ వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఇక ఈ సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వరుస షూటింగ్ షెడ్యూల్స్ బిజీగా ఉన్నాడు బాలయ్య.

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా బాలకృష్ణ పెళ్లికి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ దేవులపల్లి సూర్యారావు కుమార్తెను బాలయ్య పెళ్లి చేసుకున్నారు. కార్డులో.. వీరి వివాహం 1982 డిసెంబర్ 8వ తేదీ బుధవారం తిరుపతిలోని కర్ణాటక మండపంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య పెళ్లి నాటికి ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. వసుంధర బంధువుల అమ్మాయే అని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ పెళ్లి పత్రిక నందమూరి వారింటిది కాదు. వసుంధరా దేవి పుట్టింటి వారి పెళ్లి కార్డ్ అని అర్థం అవుతోంది.

259 views