ASWINI DUTT-NTR:జూనియర్ ఎన్టీఆర్ వలన 32 కోట్లు నష్టపోయాను ! నిర్మాత అశ్వినిదత్ సంచలన వ్యాఖ్యలు.

Posted by venditeravaartha, May 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్ద నిర్మాత ల లో ఒకరు అయినా అశ్వినీదత్ గారు 1975 లో వైజయంతి మూవీస్ ని స్థాపించి సీనియర్ ఎన్టీఆర్ గారితో ఎదురులేని మనిషి అనే సినిమా తో నిర్మాత మొదలు పెట్టారు,ఇక వరుసగా యుగపురుషుడు ,గురు శిష్యులు,అగ్ని పర్వతం,ఆఖరి పోరాటం వంటి హిట్లు వచ్చిన తర్వాత రాఘవేంద్ర రావు ,మెగా స్టార్ చిరంజీవి గారి కలయిక లో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ అయినా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా వైజయంతి మూవీస్ నిలిచింది.రెండవ జెనరేషన్ హీరో లు అయినా మహేష్ బాబు,రామ్ చరణ్,అల్లు అర్జున్ ,జూనియర్ ఎన్టీఆర్ ,ఆది సాయికుమార్ వంటి వారిని పరిచయం చేసి స్టార్ లాంచింగ్ పాడ్ గా మారారు.

1975 నుంచి 2011 వరకు దాదాపు 36 సంవత్సరాల లో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న అశ్వినీదత్ గారు ఒక్క సినిమా తో ,ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో అసలు ప్రొడక్షన్ కంపెనీ నుంచి సినిమా తీయలేని స్థాయి కి వచ్చేసారు.స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న కు సమాధానం చెప్తూ ‘జూనియర్ ఎన్టీఆర్ ‘,’మెహర్ రమేష్’ కలయిక లో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ‘శక్తి’ మూవీ డిజాస్టర్ గా నిలించింది.ఈ సినిమా వలన అప్పటి వరకు సంపాదించిన డబ్బులు మొత్తం పోయాయి,వేరే ప్రొడ్యూసర్ లు అయ్యి ఉంటె సూసైడ్ చేసుకునేంత లా ఉండేది కానీ నేను ఆ దెబ్బ తో మూవీస్ ప్రొడ్యూస్ చేయడం ఆపేసాను,బయట బిజినెస్ లు చేసుకుంటూ ఉండిపోయా.దాదాపు గా 32 కోట్ల వరకు జూనియర్ ఎన్టీఆర్ శక్తి వలన నష్టపోయాను.

2011 నుంచి సినిమా లా ను ఆపేసిన వైజయంతి మూవీస్ ,అశ్వినీదత్ గారి కుమార్తె లు అయినా స్వప్న దత్ ,ప్రియాంక దత్ లు కలిసి స్వప్న సినిమా ద్వారా ,వైజయంతి మూవీస్ తో కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ని నిర్మించారు,తర్వాత మహానటి,జాతిరత్నాలు ,సీత రామం వంటి బ్లాక్ బస్టర్ సినిమా లా ను తీశారు,ఇక ఇప్పుడు ఇండియన్ మోస్ట్ వైటెడ్ చిత్రాల లో ఒకటి అయినా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ ని నిర్మిస్తున్నారు.ఇది ఇండియన్ సినిమా లా లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రం గా ఉండబోతున్నది.

653 views