Tollywood-Kollywood: విక్రమ్ ,జైలర్ లాంటి సినిమా లు తీసే దర్శకులు టాలీవుడ్ లో లేరా?

Posted by venditeravaartha, August 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు ఉన్న డైరెక్టర్ ల లో ప్రతి ఒక్కరి ఆలోచన మరియు
వారు తీయాలి అనుకునే సినిమా ని పాన్ ఇండియన్ స్థాయి లో ప్లాన్ చేసుకుంటున్నారు,ఇక రాజమౌళి గారు తీసిన బాహుబలి సిరీస్ తో ఈ పాన్ ఇండియన్ మూవీ ట్రెండ్ కొనసాగుతోంది
అయితే ఇక్కడ డైరెక్టర్ లు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే పాన్ ఇండియన్ సినిమా తీయాలి అంటే భారీ బడ్జెట్ లేదా పెద్ద మార్కెట్ ఉన్న హీరో అవసరం లేదు ,కథ లో మంచి విషయం ఉండి దానికి తగిన నటి నటులు కుదిరితే ఆ సినిమా ని ఆదరించడానికి అన్ని రకాల ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.అయితే ఇటీవల రిలీజ్ అయినా ఇండియన్ సినిమా ల లో మన తెలుగు సినిమా కాస్త ముందు ఉన్నప్పటికీ మన సినిమా ని తమిళ్ సినిమా ని డామినేట్ చేసే
పరిస్థితి వచ్చింది అంటే అది మాములు విషయం కాదు.

vikram

తమిళ ఇండస్ట్రీ లో సీనియర్ సూపర్ స్టార్ లు అయినా రజినీకాంత్ ,కమల్ హాసన్ లు గత కొంత కాలం నుంచి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ వచ్చారు,కమల్ హాసన్ గారికి అయితే ఆయన మార్కెట్ తో పాటు ఆర్ధిక సమస్యలు సైతం వచ్చాయి అదే టైం కి ఆయనే నిర్మాత గా
మారి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించి కమల్ హాసన్ గారికి బెస్ట్ కం బ్యాక్ అయింది.దాదాపు 450 కోట్ల పైన కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం తో లోకేష్ కనగరాజ్ తన సూపర్ డైరెక్షన్ తో పాటు ఇండియా లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ తో కలిసి పని చేసే అవకాశం లభించింది.ప్రస్తుతం తలపతి విజయ్ తో లియో ఆ తర్వాత రజని తో ఆ వెంటనే ఖైదీ 2 తో బిజీ గా ఉన్నారు.

jailer

లోకేష్ కనగరాజ్ మాదిరిగానే మరొక యంగ్ సెన్సషనల్ డైరెక్టర్ కూడా అదే బాట లో ఉన్నారు
ఆయనే నెల్సన్ దిలీప్ కుమార్ ఇతను చేసిన నాలుగు సినిమా లు కూడా నలుగురు సూపర్
స్టార్స్ తోనే ఇక ఈ మధ్య రిలీజ్ అయినా రజినీకాంత్ గారి జైలర్ మూవీ ఏ స్థాయి లో కలెక్షన్
రాబడుతుందో అందరికి తెలిసిందే.ఏడు పదుల వయస్సు లో కూడా రజినికాంత్ గారి స్టైల్ ని నెల్సన్ చూపించిన విధానం మరియు కథ లో విషయం దానికి సరిపడే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు అనే చెప్పాలి.ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే మన తెలుగు వాళ్ళకి సినిమా నచ్చితే అది తమిళ్ ,హిందీ అనేది చూడరు.అలానే ఈ రెండు సినిమా ల కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

project k

ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే మన డైరెక్టర్ ల దగ్గర కథ లు లేవా, లేకపోతె వాళ్ళ దగ్గర ఉన్న కథ ల కి మన హీరో లు సెట్ కావడం లేదా అనేది పెద్ద ప్రశ్న గా ఉంది.రాజమౌళి తో సహా మిగిలిన దర్శకులు అందరు కూడా ఏదో కమర్షియల్ గా సినిమా చేయాలి నాలుగు ఫైట్స్
ఒక ఆరు పాటలు పెట్టి తీస్తే సరిపోతుంది అనేలా తీస్తున్నారు కమర్షియల్ గా అవుతున్నప్పటికీ ఎపిక్ హిట్ అన్నట్లు ఉండటం లేదు.దానికి కారణాలు ఎన్నో  తెలుగు డైరెక్టర్ లు ప్రాజెక్ట్ కే  సినిమా ల తో పాటు గా ఒక విక్రమ్,జైలర్ వంటి సినిమా లు తీయాలని అని మన హీరో లు అటువంటి క్యారెక్టర్ లు చేయాలి.

1859 views