Anjali : ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకుని.. మ్యారేజ్ లైఫ్ ‘జర్నీ’ స్టార్ట్ చేయనున్న అంజలి

Posted by RR writings, January 11, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Anjali : తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇది కాకుండా శంకర్-రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ మొదలైంది. అమ్మడి కెరీర్‌లో అనేక వివాదాలు ఉన్నాయి. హీరో జైతో ఎఫైర్.. పెళ్లి, రూమర్స్, కిడ్నాప్.. ఇలా ఎన్నో రూమర్స్ ఆమె జీవితంలో ఉన్నాయి. తాజాగా ఈ చిన్నది మీడియాలో కనిపించకపోవడంతో.. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంజలి ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.

‘‘నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరిని కలిసినా.. మాట్లాడినా కూడా ఏదో ఒక ఎఫైర్ అంటగడుతున్నారు. ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారు. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారు. ఇప్పుడు మరో బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యినట్లు రాస్తున్నారు. నాకే తెలియకుండా నా పెళ్లి చేస్తుంటే.. నాకే నవ్వు వస్తోంది” అంటూ అంజలి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉందని, పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అందరికి చెప్పుతానంది. ఇక అంజలి గేమ్ ఛేంజర్ సినిమాతో అమ్మడు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి.

832 views