Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ ను పక్కన పెడుతున్న సీఎం జగన్

Posted by venditeravaartha, May 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Anil Kumar Yadav: వైసీపీ ప్రభుత్వం 151 సీట్లలో ప్రభంజనం సృష్టించి చరిత్ర తిరగరాసింది అని చెప్పాలి దాదాపు జగన్ మార్క్ ప్రకారం వైసీపీ లో పోటీ చేసిన వారు అందరూ కూడా గెలిచారు అయితే గెలిచినా వాళ్లలో మొదటి సారి కొంత మందికి మంత్రి పదవి కూడా వరించింది అని చెప్పాలి అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లా నుంచి మంత్రి స్థానం అనిల్ కుమార్ యాదవ్ దక్కించుకున్నారు అని చెప్పాలి అయితే అయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టాపిక్ గా మారారు అని చెప్పాలి పదవి వచ్చిన తర్వాత అయన దూకుడు పెంచారు అని చెప్పాలి ఆ దూకుడే ఇప్పుడు కొంప ముంచిందా.. అంటే అవును అనే చెప్పాలి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ( YCP ) పార్టీలో సముచిత స్థానం ఇవ్వటం లేదు అని అయన అభిమానుల ఆవేదన చెందుతున్నారు మంత్రి పదవి తర్వాత ఆయనకు పార్టీ లో కొంచెం ప్రాధాన్యత తగ్గింది అని చెప్పచ్చు.

Cm Jagan Said to ex minister Anil Kumar Yadav
Anil Kumar Yadav

అనిల్ బాబాయ్ అయినా రూప్ కుమార్ తో జగన్( Jagan ) ప్లాన్ చేసారని నెల్లూరు జిల్లాలో జరిగే పరిమాణాలు చుస్తే అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ పక్కన పెడుతున్నారని జగన్ పొమ్మన అనిల్ వెళ్లకుండా పార్టీలో ఉంటాను అని అన్ని తెలిసికూడా ప్రకటన చేసారు అని నెల్లూరు వైకాపా లోనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఈ సారి టిక్కెట్ కూడా కష్టమేనా అంటే అవును అనే చెప్పాలి అలాగే జరుగుతున్నాయి పరిణామాలు కూడా మంత్రి గా దూకుడుగా పనిచేసిన పలుమార్లు ప్రవర్తించి జగన్ నా వెనకే ఉన్నారు అని అందుకే ప్రభుత్వం వచ్చిన తరవాత నాకు మంత్రి పదవి ఇచ్చారని పలు సీనియర్లు కూడా లెక్క చేయకుండా తోటి శాసన సభ్యులను కూడా లెక్క చేయకుండా చులకన చేసి చూడటం పై పార్టీ సొంత నేతలే అయన కు వ్యతిరేకమయ్యారు అని చెప్పాలి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotamreddy Sridhar Reddy ), ఆనం రామనారాయణ రెడ్డి,పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ముఖ్య కారణం కూడా అనిల్ కుమార్ అని పార్టీ భావిస్తుంది.

Also read: పవన్ కళ్యాణ్ రాజకీయానికి పనికి రాడు..కాపు ఓట్లు కావాలి కానీ సంక్షేమం వద్దా: పేర్ని నాని

Cm Jagan Said to ex minister Anil Kumar Yadav
Anil Kumar Yadav And Roop kumar

అని టాక్ నెల్లూరు జిల్లా కీలక నేతలపై కూడా ఇదే దూకుడు తో అందరిని దూరం చేసుకున్నారని చెప్పాలి అంతే కాదు జగన్ మంత్రి పదవి కాకాణి గోవర్దన రెడ్డికి అప్పజెప్పి అనిల్ ను గట్టి దెబ్బ కొట్టారని చెప్పాలి ఇక అనిల్ బాబాయ్ రూప్ కుమార్ కు వైసీపీ పార్టీలో ప్రాధాన్యత కూడా పెరిగింది అని చెప్పాలి ఇక ఆయన ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ఉండటం తో అనిల్ వెనుక ఉన్న వారు అంత రూప్ కుమార్ వైపు వెళ్లారు అని సమాచారం. ఇక నెల్లూరు కీలక నేత అయినటువంటి ముక్కాల ద్వారకానాథ్ తో కూడా అనిల్ కు మంచి సంబంధాలు లేవు అని సమాచారం ఇలాంటి తరుణం లో అనిల్ కు టికెట్ ఇస్తారని ఎవరు అనుకోవడం లేదు అని సమాచారం ఇటీవల అనిల్ కూడా సీఎం జగన్ టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ నుంచి వెల్లేది లేదు అని ఆయనకు ఆయనే ప్రకటన చేసుకున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రూప్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం ఇక జరుగుతున్నా పరిణామాలు అన్ని కూడా వైసీపీ అధిష్టానానికి తెలిసిందే అని టాక్ చూడాలి మరి రానున్న రోజుల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్ పరిస్థితి ఎలా ఉండబోతుందో.

793 views