ఈ మధ్య అన్ని భాషలకు చెందిన హీరోలు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. మ్యారేజ్ చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్నారు. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది. మళ్లీ ఇప్పుడు మరో హీరోయిన్ తాప్సీ కూడా నేను పెళ్లికి రెడీ అంటోంది. ఇదిలా ఉండగా ఓ హీరోయిన మాత్రం ఈ వయసులో నాకు పెళ్లెందుకు అంటోంది. ప్రస్తుతం తాను ఎందుకు ఇంత వైరాగ్యంలో నిండిపోయిందా అని ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. తాను మరెవరో కాదు హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని చేసిన కామెంట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో పుట్టిన ఆమె ముందు సింగర్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి అనేక సినిమాలలో నటించింది. 2005లో అతిథి పాత్రలు చేస్తూ నటన మొదలుపెట్టిన ఆమె తర్వాత మెయిన్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చింది.. కానీ ఎందుకో అప్పుడు చేసుకోవడం కుదరలేదు.
ప్రస్తుతం నా వయసు 40కి చేరింది. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు. అయినా నేను పెళ్లి చేసుకోకపోయినా సంతోషంగానే ఉంటా ఎందుకంటే.. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయానని చెప్పారు. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఆమె ఎదురు ప్రశ్నిస్తోంది. ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో డేటింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి సెన్సేషన్ కూడా అయింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ వారిద్దరి మధ్య దూరమైతే పెరిగింది. అప్పుడు వీరిద్దరి ఫోటోలు మాత్రమే కాదు.. చాలామంది ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల విడుదలైన ‘సైంధవ్’ సినిమాలో ఆండ్రియా ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే ఈమె నటించిన ‘పిశాచి 2’ మూవీ త్వరలో విడుదల కానుంది.