Rashmi : కోట్లు ఆస్తులున్న.. రేకుల షెడ్డులోనే బతుకుతున్న రష్మీ గౌతమ్.. పాపం పగోడికి కూడా తన కష్టాలు రావొద్దు

Posted by RR writings, February 27, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Rashmi : రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలుత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంది . ముఖ్యంగా జబర్దస్త్ షోతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో పలు స్పెషల్ షోస్ చేసి బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సుడిగాలి సుధీర్, రష్మిలా ప్రేమకథ ఓ ట్రెండ్ సెట్టర్. ప్రేక్షకులను అలరించడానికో లేక నిజంగానో తెలియదు కానీ వీరిద్దరి మధ్య నడిచే లవ్ ట్రాక్ జనాలందరూ ఇష్టపడుతారు. ప్రస్తుతం రష్మి.. ఇటు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో ఛాన్స్ లను కొట్టేస్తోంది. ఇటీవలే ఆమె మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో కాస్త రొమాంటిక్ గా నటించి ఆకట్టుకుంది.

ఇకపోతే రష్మి కెరీర్ స్టార్టింగ్ లో హాస్టల్ లో ఉంటూ అనేక కష్టాలు పడ్డట్లు వివరించింది. ప్రస్తుతం ఈమె లైఫ్ ఫైనాన్షియల్ గా అంతా బానే ఉంది. లక్షల్లో సంపాదన.. కోట్ల ఆస్తి, లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే కోట్ల ఆస్తి ఉన్న ఈ యాంకర్ ప్రస్తుతం దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇంతకి అసలు మ్యాటర్ ఏంటంటే.. సెలబ్రిటీల ఆస్తుల గురించి యూట్యూబర్స్ తమకు ఇష్టం వచ్చిన ఫోటోలు, థంబ్ నెయిల్స్ జోడించి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాళ్లకు కౌంటర్ గా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని ఫోటోలు ప్రదర్శించాడు. రష్మీ ఇల్లు చూద్దామని హైపర్ ఆది, స్క్రీన్ మీద ఓ రేకుల షెడ్డు చూపించాడు. జడ్జి ఇంద్రజ పూరి గుడిసెలో ఉంటున్నట్లు, రష్మీ రేకుల షెడ్ లో, ఇక హైపర్ ఆది స్లమ్ ఏరియాలో ఉంటున్నట్లు ఫోటోలు స్క్రీన్ పై చూపించగా.. ఒక్కసారిగా అక్కడున్నవారంతా నవ్వడం ప్రారంభించారు. ఇదంతా కామెడీలో భాగమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

433 views