గత కొంత కాలం గా సోషల్ మీడియా లో అనసూయ ,విజయ్ దేవరకొండ ఫాన్స్ మధ్య లో రగడ జరుగుతున్న విషయం తెలిసిందే ,అయితే విజయ్ దేవరకొండ తన పేరు ని ‘ది’ విజయ్ దేవరకొండ లా మార్చుకున్న సమయం లో అనసూయ చేసిన ఒక ట్విట్ వలన తన కి విజయ్ ఫాన్స్ దగ్గర నుంచి ట్రోల్ల్స్ ,నెగటివ్ కామెంట్స్ వచ్చాయి .అయితే ఈ విషయం మీద ఇంత వరకు విజయ్ దేవరకొండ రెస్పాండ్ కాకపోయినా తన ఫాన్స్ మాత్రం అనసూయా ,తన భర్త భరద్వాజ్ మీద రెచ్చిపోతున్నారు.సరిగ్గా ఇదే టాపిక్ మీద అనసూయ ఒక వీడియో రిలీజ్ చేసింది.

అనసూయ మాట్లాడుతూ సాధారణం గా సోషల్ మీడియా వెబ్సైటు ల లో కానీ ,యూట్యూబ్ ఛానల్ ల లో కానీ సెలెబ్రటీ ల గురించి గాసిప్స్ ,లేదా వారి పర్సనల్ విషయాల గురించి రాయడం కామన్ గా జరుగుతుంది,అయితే నేను ఈ మధ్య మాట్లాడిన దానికి సో అండ్ సొన్ హీరో ఫ్యాన్స్ నా మీద చేస్తున్న కామెంట్స్ కి ,ట్రోల్ల్స్ కి నేను అసలు భయపడను,నేను చెప్పింది నిజం ,మీకు నిజం రాసె దమ్ము ఉంటె రాయండి ,చూపించండి అంతే కానీ ఇలా చేయడం వలన వచ్చేది ఏమి లేదు.ఎవరు అయితే విజయ్ దేవరకొండ ఇష్యూ మీద ఇలా రాస్తున్నారో వాళ్ళకి నేను ఒక హెడ్లైన్ చెప్తాను దాని ప్రకారం రాయండి అని అన్నారు.మీకు ధైర్యం ఉంటె నిజం రాయండి ,నాకు ధైర్యం ఉంది కాబట్టి నిజం చెప్పను ,చేతా కానీ వారు అదుపు తప్పారు అని హెడ్లైన్ పెట్టుకోండి అన్నారు.
