తెలుగు స్టార్ నటి అనసూయ ( Anasuya ) ఇప్పుడు ట్రెండింగ్ నటి.. హీరోయిన్ కన్నా ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హాట్ బ్యూటీ… సినీ ఇండస్ట్రీలో ఆమె ఏం చేసినా హాట్ టాపికే అవుతోంది. కొన్ని నెలలుగా వరుస సినిమాల్లో నటిస్తున్న ఈమె లేటేస్టుగా హాట్ హాట్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సినిమాల్లో అనసూయ సైడ్ పాత్రలే పోషించినా.. మిగతా నటులను డామినేషన్ చేసే విధంగా పర్ఫామెన్స్ చూపిస్తోంది. నెట్టింట్లో నిత్యం వివాదాలతో ప్రత్యేకంగా ఉండే ఆమె గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఈ భామ చేసిన గ్లామర్ షో చూసి హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. అందాన్ని దాచుకుంటే ఏమొస్తది.. అంతా చూపించాలే.. అన్నట్లుగా అనసూయ పట్టపగ్గాల్లేకుండా బ్యూటీ షో చేయడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
హిట్టు, ఫట్టు తో సంబంధం లేకుండా అనసూయ వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటుంది. ఏ పాత్ర చేయడానికైనా రెడీ అని అనసూయ డోర్లు తెరవడంతో ఆమె కోసం కొందరు సినీ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. లేటేస్టుగా ఆమె ‘విమానం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో సముద్రఖని కీలకంగా పోషిస్తున్నారు. ఇందులో అనసూయ వేశ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అనసూయ భామ తెగ కష్టపడిపోయిందట. అందాన్ని ఏమాత్రం దాచుకోలేదట. హీరోయిన్ల కన్నా ఎక్కువగా హాట్ గా ఉంటే ఈ బ్యూటీ గ్లామర్ షో చూసి యూత్ తట్టుకోలేకపోతున్నారు.
మొదట్లోయాంకర్ గా జీవితాన్ని ప్రారంభించిన అనసూయ ఆ తరువాత జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయింది. సినిమాల్లోకి రావాలన్న ఆమె పట్టుదల అవకాశాలకు దారి చూపించింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా.. అడవిశేషు హీరోగా నటించిన ‘క్షణం’తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఇక మెగా హీరో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా పర్ఫామెన్స్ చూపించడంతో ఈ భామకు ఛాన్సెస్ వెతుక్కుంటూ వచ్చాయి.
ఇలా సైడ్ పాత్రలే కాకుండా స్పెషల్ సాంగ్ లోనూ అనసూయ నటిస్తూ ఆకట్టుకుంటోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ మూవీలో అనసూయ డ్యాన్స్ తో ఆకట్టుకుంటుంది. దీంతో ఆమెకు ఇటీవల బాలయ్య బాబు పక్కన డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. అంతకుముందు ఈమె ప్లేసులో తమన్నాను అనుకున్నా.. ఆమెను తప్పించి మరీ అనసూయకు అవకాశం ఇవ్వడంతో ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇలా ఏ పాత్ర అయినా చేయడానికి అనసూయ ముందుకు రావడంతో లేటేస్టుగా ‘విమానం’ ( Vimanam )మూవీలో వేశ్య పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే ఏమాత్రం వద్దనకుండా అందులో ఈమె నటిస్తుంది. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని పిక్ష్ బయటకు వచ్చాయి. ఇవి హట్ హాట్ గా ఉండడంతో కుర్రాళ్లు ఈ ఫొటోలపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.