Anasuya:విమానం మూవీ డైరెక్టర్ మీద ఇంట్రస్టింగ్ స్టోరీ చెప్పిన అనసూయా !

Posted by venditeravaartha, April 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అనసూయ భరద్వాజ్ టెలివిజన్ కి బాగా పరిచయం ఉన్న భామ. ఈ భామ జబర్దస్త్ కార్యక్రమంతో అందరికీ దగ్గరైంది తన అందచందాలు డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రాళ్ళ గుండెల్లో నిలిచిపోయింది. అనసూయ దాదాపుగా టెలివిజన్ అన్ని చానల్స్ లో కనిపించి సందడి చేస్తుండేది అయితే తనకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో అవకాశం రావడం ఆ తర్వాత తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తుంది చిన్నచిన్న హీరోలతో కాకుండా స్టార్ హీరో అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పెద్ద పాత్ర లో అవకాశం దక్కించుకుంది.పుష్ప 2 లో తన రోల్ ఇంకా వైరల్ గా ఉండబోతుంది అనే వార్తలు వస్తున్నాయి అయితే తన నటనతో అందరిని మెప్పించిన ఈ భామ ఇప్పుడు శివప్రసాద్ డైరెక్షన్ లో విమానం అని చిత్రంలో నటిస్తుంది.

టెలివిజన్ లో హంగామా చేస్తూ ఉండే ఈ భామ ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీ గా గడుపుతుంది దీని వలన టెలివిజన్ కి కాస్త దూరం అయిందని చెప్పవచ్చు అయితే రీసెంట్ గా అనసూయ భరద్వా జ్ విమానం సినిమా డైరెక్టర్ శివ ప్రసాద్ గురించి ఒక సీక్రెట్ ను సోషల్ మీడియాతో పంచుకుంది సీక్రెట్ ను సోషల్ మీడియాలో బయట పెట్టడం ఏమిటి అని అనుకుంటున్నారా మరి ఏమిటో కాదండి విమానం సినిమా తీస్తున్న డైరెక్టర్ ఇంతకు ముందు ఎప్పుడూ విమానమే ఎక్కలేదట మీరు కూడా షాక్ అయ్యారా అవునండి తనకు విమానం ప్రయాణం గురించి ఏమి తెలియనప్పుడు తాను చేసిన మొదటి విమాన ఒంటరి ప్రయాణం గురించి తన మాటల్లో చెబుతున్న వీడియోను అనసూయ సోషల్ మీడియ తో పంచుకున్నారు.సడన్గా డైరెక్టర్ గారు ఫోన్ చేసి శివ నువ్వు చెన్నై వెళ్లి సముద్రఖని గారితో డబ్బింగ్ చెప్పించుకొని రావాలని చెప్పి ఫోన్ పెట్టేయడంతో ఒక్కడినే ఎలా వెళ్లాలని బస్ లేదా ట్రైన్ అని ఆలోచిస్తున్నా సమయం లో ఫ్లైట్ టికెట్స్ వాట్సప్ చేశారు.

ఫ్లైట్ అనగానే నాలో సంతోషం లేదు భయం మొదలైంది ఎలా వెళ్లాలో తెలియదు అనే భయం ఉండేది అప్పుడే జి స్టూడియో నుండి ఉషా గారు ఫోన్ చేసి మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నారట అందుకే క్రాంతి గారిని పంపిస్తున్నాను మీ మొదటి ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ నీ షూట్ చేస్తారు అని చెప్పారు. క్రాంతి గారిని అడిగాను ఆయన లేదు సర్ నేను షూట్ చేయడానికి మాత్రమే వచ్చాను నేను మీకు ఎటువంటి సహాయం చేయను అని చెప్పేశారు దానితో అందరినీ అడుగుతూ భయం భయం గా ఫ్లైట్ ఎక్కేసాను చెన్నై చేరుకున్న పని పూర్తి చేసుకొని తిరిగి వస్తుంటే ఏదో తెలియని సంతోషం నేను ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాను. ఒక్కడినే అని సంతోషమును పంచుకున్న వీడియోను అనసూయ సోషల్ మీడియాతో పంచుకున్నారు విమానం చిత్రంలో సముద్ర కానీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

1956 views