Anupama : బరి తెగించిన హీరోయిన్ అనుపమ.. అడవుల్లో ఏకంగా అలాంటి పనులు

Posted by RR writings, February 26, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Anupama : కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ.. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ క్యూటీ.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళం, మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అనుపమ ప్రస్తుతం టాలీవుడ్‌లో సిద్దు జొన్నలగడ్డతో కలిసి టిల్లూ స్క్వేర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో సిద్దు జొన్నల గడ్డ హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా టిల్లూ స్క్వేర్ రూపొందుతోంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని బోల్డ్ సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అనుపమ మునుపెన్నడూ లేని విధంగా చాలా బోల్డ్‌గా నటించింది. హ‌ద్దులు చెరిపేసి రెచ్చిపోయింది. అది చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి అనుపమ.. నిన్న మొన్నటి వరకు ఇంత సంప్రదాయంగా ఉన్న నువ్వు ఒక్కసారిగా బోల్డ్ గా తయారయ్యావు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఈ కేరళ క్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. స్కై డ్రైవింగ్, స్కై రోప్ సైక్లింగ్, కార్ రేస్, జలపాతాల దగ్గర ఎంజాయ్ చేయడం, అడవిలో జంతువులను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడం ఈ వీడియోలో చూడవచ్చు. వీడియోలో ఆమె పడవపై నృత్యం చేయడం కూడా కనిపించింది. ఇంతలో అనుపమ అడవిలో పులిని దగ్గర నుంచి చూస్తూ వీడియోకి స్టిల్ ఇచ్చింది. అమాయకంగా కనిపించే అనుపమకు అంత ధైర్యం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

https://www.instagram.com/reel/C3xmvCIJRLK/?utm_source=ig_embed&ig_rid=81538325-ec9b-41ce-a069-3b3c80b7d84c

237 views