అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు. కానీ జనాల్లో మాత్రం బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇరాఖాన్ ను మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇరా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు ఇరా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఇరా ఖాన్ తన భాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేను పెళ్లాడబోతోంది. త్వరలో అమీర్ ఖాన్, తన మొదటి భార్య రీనా దత్తా కుమార్తె వివాహం జరగనుంది. జనవరి 3న కాబోయే భర్త నుపుర్ శిఖరేతో ఇరా ఖాన్ కోర్టు వివాహం చేసుకోబోతున్నారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు.
కోర్టు వివాహం తర్వాత ఇరా, నూపూర్ వివాహ కార్యక్రమాలు ఉదయపూర్‌లో జరుగుతాయి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకకు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు ఈ వేడుకకు హాజరుకావడం లేదు. అమీర్ ఖాన్ ఇరా వివాహం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇప్పటికే పెళ్లి సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. గతేడాది నవంబర్‌లో ఇరా, నూపూర్‌ల నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిశ్చితార్థానికి సంబంధించిన చాలా వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
అందులో అమీర్ ఖాన్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నూపూర్‌ని ఎలా కలిశానో గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇరా చెప్పింది. నుపుర్ ఫిట్‌నెస్ ట్రైనర్ అని ఇరా ఖాన్ చెప్పింది. తనకు 17 ఏళ్ల వయసులో నుపుర్ తనకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. తాను అతనిని సూపర్ ఫిట్ పర్సన్ గా చూసేదానినని పేర్కొంది. అంతే కాకుండా తనను ఎంతో అభిమానించేదట. ఆ తర్వాత అలా ఫ్రెండ్స్ అయ్యి తర్వాత డేటింగ్ మొదలు పెట్టినట్లు ఇరా ఖాన్ చెప్పింది.