ALLU ARJUN:20 సంవత్సరాల సినీ కెరీర్ లో అల్లు అర్జున్ ఏమి సాధించాడు

Posted by venditeravaartha, March 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ 5 హీరో లో ఒకరు గా ఉన్న ‘స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ గారు చిత్ర సినిమా లో అడుగు పెట్టి ఈ రోజు కి ’28 మార్చ్ 2023 ‘ కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, ఈ ప్ర‌యాణాన్ని గుర్తుచేసుకుంటూ అల్లు అర్జున్ గారు ఎమోష‌న‌ల్ పోస్ట్
ఒకటి పెట్టాడు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.“ఈ రోజుతో నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ ప్ర‌యాణంలో ఎంతో మంది ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నా. జ‌ర్నీలో నాకు అండ‌గా నిలిచి నా విజ‌యానికి కార‌ణ‌మైన ఇండ‌స్ట్రీలోకి ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా. అభిమానుల ప్రేమ‌,ఆద‌ర‌ణ వ‌ల్లే న‌టుడిగా ఈ స్థాయికి చేరుకున్నాన‌ని” బ‌న్నీ ఈ పోస్ట్‌లో పెర్కొన్నాడు. అత‌డి ఎమోష‌న‌ల్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

2003లో దర్శకేంద్రుడు కే రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా రాఘవేంద్ర రావు గారికి 100 వ సినిమా, ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అల్లు అర్జున్ న‌ట‌న‌, లుక్‌పై చాల మంది
విమర్శించారు. ఆ నెగెటివ్ కామెంట్స్‌ను పాజిటివ్‌గా తీసుకుంటూ వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ అగ్ర హీరోల్లో ఒక‌రిగా ఎదిగాడు అల్లు అర్జున్‌.

గంగోత్రి సినిమా తర్వాత తాను ఎంచుకున్న కథలే తనని ఇప్పుడు ఈ స్థాయి కి తీసుకుని వచ్చాయి అనడం లో సందేహమే లేదు, గంగోత్రి తర్వాత ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్న తరుణం లో సుకుమార్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ తో అల్లు అర్జున్ ని సరి కొత్త కోణం లో చూపిస్తూ ‘ఆర్య ‘ సినిమా ని చేసారు. ఇది మొదట్లో కొంచెం స్లో గా స్టార్ట్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 2004 లో రిలీజ్ అయినా సినిమా ల కలెక్షన్ లో టాప్ 2 లో నిలిచింది. తన మూడవ సినిమా ‘బన్నీ ‘ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుని, హ్యాట్రిక్ హిట్లు సాధించిన హీరో ల సరసన చేరాడు.

2006 లో రిలీజ్ అయినా ‘హ్యాపీ’ సినిమా ప్లాప్ అయినా ,2007 రిలీజ్ అయినా ‘దేశముదురు’ సినిమా తో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు , తర్వాత రిలీజ్ అయినా ‘పరుగు ‘ సూపర్ హిట్ అందుకున్న , తన తుదుపరి చిత్రాలు అయినా ‘ఆర్య 2 ‘,’వరుడు ‘,’వేదం ‘,’బద్రీనాథ్ ‘ సినిమా లు నిరాశపరిచాయి. అయితే 2012 లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ‘జులాయి ‘ సినిమా తో మరల హిట్ ట్రాక్ ఎక్కారు.

2014 ,2015 ,2016 ల లో వరుసగా ‘రేసుగుర్రం’ ,’సన్ అఫ్ సత్యమూర్తి’ ,’సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ల తో ఒక్క సారి గా అల్లు అర్జున్ తెలుగు సినిమా స్థాయి నుంచి ఇండియన్ సినిమా స్థాయి వరకు ఎదిగి పోయారు ,అయితే మొదటి నుంచే తెలుగు తో పాటు మలయాళం లో కూడా క్రేజ్ ని సొంతం చేసుకున్నారు బన్నీ.2020 లో రిలీజ్ అయినా ‘అలా వైకుంఠ పురము లో ‘ సినిమా తో నాన్ బాహుబలి రికార్డు ల ను బద్దలు కొట్టడమే కాకుండా ,కొత్త ఇండస్ట్రీ రికార్డు ని సృష్టించాడు.

2021లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజైన పుష్ప సినిమాతో పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయాడు. ప్ర‌స్తుతం పుష్ప సినిమా సీక్వెల్‌తో బ‌న్నీ బిజీగా ఉన్నాడు. ఈ సీక్వెల్ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. పుష్ప -2 తో పాటు ఇటీవ‌లే సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో పాన్ ఇండియ‌న్ సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. తన 20 సంవత్సరాల కెరీర్ లో గెస్ట్ రోల్ లో నటించిన ‘ఎవడు ‘,’రుద్రమ్మ దేవి ‘ సినిమా ల తో కలిపి 21 సినిమా ల లో నటించారు.

350 views