పుష్ప సినిమా నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఐకాన్ స్టార్ గా మారాడు ,దానికి మొదటి కారణం ‘ఐకాన్’ అనే సినిమా చేయడానికి పుష్ప సినిమా కి ముందే ప్లాన్ చేసుకున్నారు అల్లు అర్జున్ ,కానీ అప్పట్లో కొన్ని పరిస్థితుల కారణం చేత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఈ సినిమా ని దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకుడిగా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే, అయితే ఇప్పుడు ఐకాన్ కథ అటు తిరిగి ఇటు తిరిగి మరొక హీరో వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ హీరో ఎవరు ????
అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ కు సంబంధించిన వార్తలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ నానితో ఎంసీఏ సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లోనే మరో ఆఫర్ అందుకున్నాడు. ఇక బన్నీ డేట్స్ ఇవ్వడంతో ఈ దర్శకుడికి మంచి అవకాశం దొరికింది. ఇక ఐకాన్ కథ కోసం మరో ఏడాది పాటు కూర్చున్న దర్శకుడు శ్రీరామ్ మొత్తానికి కథతో అయితే మెప్పించాడు.
అయితే పుష్ప సినిమా తర్వాత బన్నీ ఆలోచన విధానం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఉన్న ఫ్యాన్ ఇండియా క్రేజ్ కు తగ్గట్టుగా ఐకాన్ కథను సిద్ధం చేయాలి అని స్క్రిప్ట్ లో కూడా చాలా మార్పులు చేయాలి అని సలహాలు ఇచ్చాడు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం ఆ స్థాయిలో ఆ స్క్రిప్టును బన్నీకి నచ్చే విధంగా మళ్లీ చెప్పలేకపోయాడు. దీంతో ఆ ప్రాజెక్టు విషయంలో అల్లు అర్జున్ వెనుకడుగు వేయాల్సి వచ్చింది.ఇక అల్లు అర్జున్ ఆ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో దిల్ రాజు మరో హీరోతో తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. బన్నీ రిజెక్ట్ చేసిన తర్వాత సరాసరి దర్శకుడు మరో హీరో రామ్ పోతినేని కి దగ్గరికి వెళ్ళాడు. అయితే రామ్ కూడా ఆ కథ చాలా బాగుందని తప్పకుండా చేస్తాను అని దిల్ రాజుకు మాట కూడా ఇచ్చాడు.
అయితే రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంతకుముందే ఒప్పుకున్నాడు. దీంతో ఐకాన్ కథను ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశం అతనికి లేకుండా పోయింది. ఇక రామ్ ఆలస్యం చేస్తూ ఉండడంతో వేణు శ్రీరామ్ కూడా ఓపిక పట్టలేకపోయాడు. ఇప్పటికే సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అందుకే వీలైనంత త్వరగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి అని అతను కోరుకుంటున్నాడు.
మొత్తానికి వేణు శ్రీరామ్ మరో ఏడాదిని వృధా చేసుకోకుండా చేయాలి అని దిల్ రాజు మరొక హీరోను లైన్ లోకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. నితిన్ అని కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ అనిపిస్తోంది. నితిన్ తో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. దిల్ సినిమాతోనే దిల్ రాజు నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు ఐకాన్ కథలో కొన్ని మార్పులు చేసి నితిన్ కు తగ్గట్టుగా సెట్ చేయాలని అనుకుంటున్నారట. మరి అతను ఒప్పుకుంటాడో లేదో చూడాలి.