Akhil: నన్ను క్షమించండి! మీ నమ్మకాన్ని కోల్పాయాను :అఖిల్

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని అఖిల్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ,ఎంతో కష్టపడి చేసిన సినిమా ఏజెంట్ మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా కి ఊహించని స్థాయి లో డిజాస్టర్ అయింది సినిమా రిజల్ట్ ముందుగానే తెలియయడం తో ప్రొడ్యూసర్స్ సైతం ప్రొమోషన్స్ చేయలేదు..ఇక సినిమా విడుదల అయినా మూడవ రోజునే నిర్మాత సినిమా డిజాస్టర్ అయింది..మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి అని లెటర్ రిలీజ్ చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. రిలీజ్ అయినా మొదటి వారం తర్వాత కంప్లీట్ వాష్ అవుట్ అవడం తో బయర్స్ కి భారీ నష్టాలు తగిలాయి..మరి ఆ నష్టాలను పూడ్చుతామని నిర్మాత మాట ఇచ్చారు కూడా.అయితే ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో మానసికంగా కృంగిపోయిన అఖిల్ తన ఈ సినిమా రిజల్ట్ మీద తన మనసులో మాటలని పంచుకున్నారు..ఇప్పుడు అవి తెగ వైరల్ అవుతున్నాయి.

ఏజెంట్ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి న ధన్యవాదాలు..సినిమా ని ఎంతో నమ్మి ,ప్రేమించి చేసాము అందరు వారి వారి బెస్ట్ ఇచ్చారు,ఒక మంచి సినిమా ని మీ అందరికి ఇవ్వాలని అనుకున్నాం..అలానే ఇంత భారీ సినిమా ని తీసిన ప్రొడ్యూసర్స్ అనిల్ గారికి నా స్పెషల్ థాంక్స్..అందరి డిస్ట్రిబ్యూటర్స్ కి ,సినిమా ని ప్రమోట్ చేసిన మీడియా కి స్పెషల్ థాంక్స్.నా మొదటి సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను..మీరు ఇచ్చిన సపోర్ట్ వలనే నేను ఇంత కష్టపడుతున్నాను,ఇక రాబోయే సినిమా ల ద్వారా మంచి సినిమా తో స్ట్రాంగ్ గా మీ ముందుకు వస్తాను అని మాట ఇస్తున్న అని లెటర్ రిలీజ్ చేసారు అఖిల్.

613 views