AGENT:ఏజెంట్ డిజాస్టర్ మీద నిర్మాత సంచలన వ్యాఖ్యలు ! సరైన కథ లేకనే సినిమా భారీ ప్లాప్ అయింది.

Posted by venditeravaartha, May 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు కీలక వ్యక్తి ఎవరు అంటే ఎవరు అయినా వెంటనే చెప్పే సమాధానం ‘నిర్మాత’,కానీ మారుతున్న సినీ సమీకరణాల లో హీరో ,డైరెక్టర్ లు కీలక వ్యక్తుల మారుతున్నారు.హీరో కి ఉన్న బిజినెస్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ మంచి స్టోరీ తో వస్తే బయట వడ్డీ ల కి తెచ్చి నిర్మాత లు సినిమా ని తెస్తున్నారు.అయితే మొదటి 3 రోజుల లోనే వారు పెట్టిన బడ్జెట్ అంతా వెనక్కి తీసుకుని రావాలనే ఆశ తో రిలీజ్ కి ముందు రోజు నుంచి వివిధ వెబ్ సైట్ ల కు ,టీవీ ఛానెల్స్ కి ,రివ్యూ రాసేవారికి ,పబ్లిసిటీ కోసం బాగా ఖర్చు చేస్తారు.
సినిమా కొంచెం బావుంటే ఫేక్ కలెక్షన్ ల తో ఇంకొంచెం పబ్లిసిటీ చేస్తారు.ఒక వేళా సినిమా ప్లాప్ అయినా మొదటి వారం కలెక్షన్ ల కోసం ఇంకొంచెం ఖర్చు చేసి పబ్లిసిటీ చేస్తున్నారు.కానీ వీటి అన్నిటికి బిన్నంగా సూపర్ ప్లాప్ గా నిలిచినా ‘ఏజెంట్’ నిర్మాత అనిల్ సుంకర గారు సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఎంతో కష్టపడి అఖిల్ ,సురేందర్ రెడ్డి గారు కలిసి చేసిన సినిమా ‘ఏజెంట్’, 28 ఏప్రిల్ నా ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయింది.రిలీజ్ అయినా మొదటి షో నుంచే విపరీతమైన నెగటివ్ టాక్ తో సూపర్ ప్లాప్ గా నిలిచింది.36 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయినా ఏజెంట్ మూవీ మొదటి రోజు కేవలం 4 .84 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది.ఇక 29 ,30 డేట్ ల లో కలెక్షన్ లు దారుణం గా పడిపోయాయి.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాదు కదా కనీసం కరెంటు బిల్ లు కూడా రాలేని పరిస్థితుల లో సినిమా నిర్మాత అయినా అనిల్ సుంకర గారు ,ఈ సినిమా మీద వస్తున్న ట్రోల్ల్స్ కి ,సినిమా రిజల్ట్ కి పూర్తి బాధ్యత తామే తీసుకుంటాం అంటూ చేసిన ట్విట్ బాగా వైరల్ అవుతుంది.సినిమా రిలీజ్ అయినా 3 రోజుల కి ఆ సినిమా నిర్మాత సినిమా ఫెయిల్యూర్ ని ఒప్పుకుని ఇక మీద ఎలాంటి జరగవు అని చెప్పడం ,అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఏజెంట్‌ సినిమా మీద వస్తున్న నెగటివ్ టాక్ ,ట్రోల్ల్స్ అన్నిటి ని తీసుకుంటున్నం. ఇది ఒక కష్టమైన పని అని మాకు తెలిసినప్పటికీ, మేము దానిని సక్సెస్ అవుతాం అనుకున్నాము, కానీ మేము సరైన స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం తో పొరపాటు చేయడంతో ,దానికి తోడు కోవిడ్‌ రావడం తో అనుకున్నది అనుకున్నట్లు చేయడం లో విఫలమయ్యాము. సాకులు చెప్పకూడదనుకుంటున్నాము, అయితే ఈ భారీ అపజయం నుండి ఇక మీద ఎలాంటి తప్పులను ఎప్పటికీ పునరావృతం చేయము అని నిర్ధారించుకోవడానికి మేము మరల మంచి సినిమా తో వస్తాము చూడండి. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు. మేము మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో అంకితమైన ప్రణాళిక తో కష్టపడి ఈ సినిమా నష్టాలను భర్తీ చేస్తాము అని ట్విట్ చేసారు.

905 views