Adipursh: ఆదిపురుష్ సినిమా కి ఆగని కష్టాలు ! జూన్ 16 న రిలీజ్ కష్టమేనా ?

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి(Bahubali) సినిమా తర్వాత ప్రభాస్(Prabhas) గారి రేంజ్ ఏ స్థాయి లో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ,మన తెలుగు రాష్ట్రాల లో ఎంత ఫ్యాన్ బేస్ అయితే ఉందొ అదే స్థాయి లో బాలీవుడ్ లో సంపాదించుకున్నారు అంటే అది మాములు విషయం కాదు ,ఇండియన్ బ్లాక్ బస్టర్ అయినా బాహుబలి తర్వాత రిలీజ్ అయినా సాహూ సినిమా తెలుగు లో ఆశించిన స్థాయి లో ఆడకపోయినప్పటికీ హిందీ లో బ్లాక్ బస్టర్ అయింది అక్కడ 100 కోట్ల పైన కలెక్షన్ సాధించింది. మరి ఆ తర్వాత రిలీజ్ అయినా ‘రాధే శ్యామ్’ డిజాస్టర్ అయినప్పటికీ ప్రభాస్ రేంజ్ ఇంచ్ కూడా తగ్గలేదు అని చెప్పడానికి మరో ఉదాహరణ త్వరలో రిలీజ్ కానున్న ‘ఆదిపురుష్’ సినిమా.

500 కోట్ల బడ్జెట్ తో తెరక్కెనిన ఈ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ కానుంది దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయి రికార్డు ల రికార్డు లు ను బద్దలు కొడుతోంది,ఫస్ట్ రిలీజ్ అయినా ఆదిపురుష్(Adipursh) టీజర్ లో హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా రాముడు ,హనుమంతుడు పాత్రల చిత్రీకరణ ఉంది అంటూ అప్పుడు కొంత మంది ఈ వివాదం మీద ముంబై హైకోర్టు కి వెళ్లారు.వారితో పాటు టీజర్ చుసిన వారంతా ట్రోల్ చేయడం తో ఈ చిత్ర డైరెక్టర్ ,నిర్మాత లు మరో 150 కోట్లు ఖర్చు చేసి గ్రాఫిక్స్ ,సెట్టింగ్స్ మొదలగు వాటికీ మార్పులు చేసారు.

మే 9 న రిలీజ్ అయినా ట్రైలర్ తో అందరి చేత ప్రసంసలు తెచ్చుకుంది.అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఆదిపురుష్ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది ,చివరగా జూన్ 16 న రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పుడు మరో వివాదం లో చిక్కకుంది
ముంబై సెన్సార్ బోర్డు మెంబెర్ అయినా ‘సంజయ్‌ దీనానాథ్‌’ మరో సరి ఈ సినిమా మీద మరో సారి ముంబై కోర్ట్ ని ఆశ్రయించారు.ఇన్ని వివాదాలు వచ్చినప్పటికీ జూన్ 16 న ఎట్టి పరిస్థుతుల లో సినిమా ని రిలీజ్ చేస్తాం అని అంటున్నారు ఆదిపురుష్ టీం.

1659 views