ADIPURSH: 500 కోట్ల ఆదిపురుష్ సినిమా ని మొదట ఆ స్టార్ హీరో తో తీయాలి అనుకున్నారు ! ఆ హీరో రిజెక్ట్ చేయడం తో ప్రభాస్ చేసారు.

Posted by venditeravaartha, May 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి తర్వాత రాజమౌళి గారికి ఎంత గా పేరు వచ్చిందో అదే స్థాయి లో ప్రభాస్ కి వచ్చింది ఒక్క హిందీ లోనే 500 కోట్ల కి పైగా నెట్ కలెక్షన్ లు రాబట్టడం అంటే అంత ఈజీ కాదు అది కూడా సౌత్ సినిమా కి ,సౌత్ హీరో కి,సౌత్ ,నార్త్ అలాంటివి లేకుండా ఇండియన్ సినిమా గా చెప్పుకునే లాగా చేసిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమా ల తో బిజీ బిజీ గా ఉన్నారు ,త్వరలో రిలీజ్ కి రెడీ గా ఉన్న ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ని మే 9 నా రిలీజ్ చేసారు ,దానికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది.అయితే ఇండియన్ సినిమా చరిత్ర లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ సినిమా ని ప్రభాస్ కి ముందు వేరే హీరో చేయాలసింది,కానీ ఆయన రిజెక్ట్ చేయడం తో ప్రభాస్ గారు చేసారు.ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు ఇండియన్ మోస్ట్ హ్యాండ్సమ్ మాన్ ‘హ్రితిక్ రోషన్’.

ఆదిపురుష్ సినిమా కథ ని డైరెక్టర్ ఓం రౌత్ మొదట గా బాలీవుడ్ స్టార్ అయినా హ్రితిక్ రోషన్ కి చెప్పారు అందులో మొదటగా శ్రీ రాముడి పాత్రా లో హ్రితిక్ ,రావణాసుర పాత్రా లో ప్రభాస్ ని అనుకున్నారు .ఇదే వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది.దానికి సంబంధించిన కొన్ని ఫోటో లు సైతం నెట్ లో కనిపించాయి.అయితే ఈ స్టోరీ లో కొన్ని మార్పులు చేస్తే తాను నటిస్తాను అని హ్రితిక్ డైరెక్టర్ ఓం రౌత్ కి కండిషన్ లు పెట్టారు అని అవి తనకి నచ్చకపోవడం తో అదే కథ ని ప్రభాస్ గారికి వినిపించి ఆయన ని ఒప్పించి ఇప్పుడు ఆదిపురుష్ ని తీశారు.

మొదట రిలీజ్ చేసిన టీజర్ లో గ్రాఫిక్స్ సరిగా లేవు అని యానిమేషన్ సినిమా ఏమైనా తెస్తున్నారా అని డైరెక్టర్ ఓం రౌత్ ని తెగ ట్రోల్ చేసారు ,అయితే అంతకు ముందు తీసిన దానిని మరల ఎడిటింగ్ చేసి దాదాపు 150 కోట్ల ని ఖర్చు చేసి అదనం గా గ్రాఫిక్ వర్క్ చేసారు.రీసెంట్ గా రిలీజ్ అయినా ఆదిపురుష్ ట్రైలర్ లో ఆ మార్పులు అనేవి స్పష్టం గా కనిపించాయి. జూన్ 16 నా రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా మీద భారీ అంచాలనే ఉన్నాయి మరి బాహుబలి తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందా లేదా అని చూడాలి.

1797 views