Adipurush : ‘ఆదిపురుష్’కలెక్షన్ల సునామీ..10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Posted by venditeravaartha, June 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రభాస్ లేటేస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆది నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించిన ఆదిపురుష్ కు ఇప్పటికే పెట్టుబడులు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే మొదటి వారం జోరుగా సాగిన వసూళ్లు నెక్టస్ వీక్ మాత్రం చాలా డల్ అయ్యాయని తెలుస్తోంది. కానీ ప్రభాస్ అంటే కలెక్షన్ల సునామీ అని ఫ్యాన్స్ తెగ చెర్చించుకుంటున్నారు. మొదటి 5 రోజుల పాటు కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆదిపురుష్ 10 రోజుల పాటు ఎంత వసూలు చేసిందో చూద్దాం.

Image

ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. విలన్ గా బాలీవుడ్ స్టార్ననటుడు సైఫ్ అలీఖాన్ పోషించారు. సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్లను చూసి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. రామాయణం నేపథ్యంలో సినిమా తీశారని కొందరు అంటున్నా.. సినీ బృందం మాత్రం నేటి కాలానికి అనుగుణంగా తీశామని అంటున్నారు. అయితే ఇందులో ఉండే విజువల్స్ హైలెట్ గా నిలిచాయి. దీంతో నేటి ప్రేక్షకులు ఆదిపురుష్ ను ఆదరించారనే చెప్పొచ్చు.

Image

ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభంలో అసలు ఇందులో ఏముందో తెలుసుకోవడానికి చాలా మంది థియేటర్ల వైపు పరుగులు తీశారు. అలా మొదటి 5 రోజుల పాటు కోట్లలో వసూలైంది. అలా ఫస్ట్ డే రోజు రూ.86.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు చేసింది. రెండో రోజు రూ.66.25 కోట్లు, మూడో రోజు రూ.69.1 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అయితే నాలుగో రోజు రూ.16 కోట్లు వచ్చినా.. 5 వ రోజు రూ.10.7 కోట్లు వసూలు చేసింది. ఇలా వారం పాటు కలెక్షన్ల వర్షం కురిసింది.

Image

అయితే రెండో వారంకొచ్చేసరికి కాస్త వెనుకబడ్డాయి. మంగళవారం రూ.10.7 కోట్లు రాగా.. ఆ తరువాత రోజు నుంచి రూ.7.25 కోట్లు తగ్గుతూ వచ్చాయి. లేటేస్టు ఆదివారం (25-6-2023)రోజున రూ.6 కోట్లు వసూలు చేసింది. అయితే వీకెండ్ అయినందున శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరిగాయి. ఇలా మొత్తం పదిరోజుల పాటు ఆదిపురుష్ సాధించింది. రూ.274.16 కోట్లు అని తెలుస్తోంది.

Image

ఆదిపురుష్ లో నేటి కుర్రాళ్లకు విజువల్స్, డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఆధ్యాత్మిక పరంగా చూసేవాళ్లు మాత్ర నిరాశ చెందుతున్నారు. అలా ఓ వర్గం వారిని మాత్రమే సినిమా ఆకట్టుకుంటుందన్న చర్చ సాగుతోంది. ఏదీ ఏమైనా ఇప్పుడున్న పరిస్తితుల్లో ఆదిపురుష్ సాధించింది ఎక్కువేనని అంటున్నారు. ఇక ఈ సినిమా నిర్మించడానికి రూ.300 కోట్లు పెట్టినట్లుసమాచారం. మరికొన్ని రోజుల పాటు ఇదే హవా సాగితే లాభాల పంట పండినట్లేనని అంటున్నారు. దీంతో ప్రభాస్ రేంజ్ మరోసారి పాన్ ఇండియా లెవల్లో రికార్డులు సృష్టించినట్లు అవుతారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

1726 views