చెయ్యి పైకెత్తి ‘వెళ్లవయ్యా బాబు వెళ్లు’అనే డైలాగ్ వినిపించగానే వెంటనే గుర్తుకొచ్చే హీరోయిన్ సదా. ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా అచ్చమైన తెలుగు అమ్మాయిలా నటించి అందరినీ ఆకర్షించింది సదా. తేజ డైరెక్షన్లో నితిన్ పక్కన నటించిన ‘జయం’ మూవీ హిట్టుకావడంతో ఆ తరువాత పలు సినిమాల్లో కనిపించింది. అయితే తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయనుకున్న సమయంలో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇక్కడ సౌత్ డైరెక్టర్ శంకర్ అపరిచితుడు సినిమాలో అవకాశం ఇచ్చి సదాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ తరువాత తమిళంలోనే కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. ఈ తరుణంలో సదా గురించి ఓ హాట్ న్యూస్ నెట్టింటా చక్కర్లు కొడుతోంది. సదా ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి? అని అందరూ అనుకుంటున్నారు.
ఈ తరుణంలో కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఓ విషయాన్ని లీక్ చేశారు. ఆమె సినిమాల్లో నటించిన ఓ స్టార్ హీరో ప్రేమలో పడిందని, ఆయన చేసిన మోసాన్ని తట్టుకోలేకే మరెవరినీ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని అనుకుంటున్నారు. ఆయనతో రెండు సినిమాలు చేసిన ఆ హీరో ఎవరో కాదు మాధవన్ అని అంటున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాధవన్ ఏడాది కిందట రాకెట్రీయర్ సినిమాతో అలరించాడు. కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయనకు సదాకు ఒకప్పుడు లవ్ రిలీషన్ ఫిప్ ఉండేదట. వీరిద్దరు కలిసి ‘ప్రియసఖి’ అనే సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. మరో తమిళ సినిమాలోనూ ఈ జంట కనిపించింది. ఈ సమంలోనే వీరిద్దరు కలిసి ప్రేమలో పడ్డారట.
ఆ తరువా ఎలాగూ పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో బెంగుళూరులోని ఓ హోటల్ లోకి వెళ్లారట. అయితే అప్పటికే మాధవన్ కు భార్య, కొడుకు ఉన్నాడు. మాధవన్, సదా హోటల్ కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ విషయం మాధవన్ భార్య వద్దకు వెళ్లడంతో ఆమె నిలదీసిందట. అయితే తన భార్యకు విడాకులు ఇచ్చి తనతో రావాలని సదా కోరిందట. కానీ మాధవన్ అందుకు ఒప్పుకోలేదట. చివరికి తాను మోసపోయమానని తెలుసుకున్న సదా.. ఇక లైఫ్ లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుందట.