Heroine Rambha: హీరోయిన్ రంభ కూతురు ఇంత హాట్ గా తయారైంది ఏంటి..? చూస్తే ఆశ్చర్యపోతారు!

Posted by venditeravaartha, November 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Heroine Rambha: అందం, అభినయం మరియు డ్యాన్స్..ఈ మూడు ఒకే చోట ఉన్న హీరోయిన్ మన టాలీవుడ్ లో దొరకడం చాలా అరుదు. కానీ అలాంటి హీరోయిన్స్ కూడా మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు, వారిలో ఒకరు రంభ. తెలుగు రాష్ట్రాల నుండి ఇండస్ట్రీ కి వచ్చి టాప్ స్టార్ గా ఎదిగిన అతి తక్కువ మంది అచ్చ తెలుగు అమ్మాయిలలో ఒకరు ఈమె. ఇండస్ట్రీ లో ఉన్నంత కాలం టాప్ స్టార్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ఒక వెలుగు వెలిగింది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇలా అన్నీ ఇండస్ట్రీస్ లో ఉండే స్టార్ హీరోలు, సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా చేసి మంచి పేరు సొంతం చేసుకుంది. అలా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సమయం లో ఇంట్లో వాళ్ళు రంభ కి పెళ్లి చేసారు.

2010 వ సంవత్సరం లో ఇంద్ర కుమార్ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన రంభ, పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఇలా పెళ్లి తర్వాత సైలెంట్ అయిపోవడం అనేది ఈమధ్య కాలం లో జరగడం లేదు. సమంత, కాజల్ అగర్వాల్ , హన్సిక ఇలా ఎంతో మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు. బంగారం లాంటి కెరీర్ ని ఎవ్వరూ మిస్ చేసుకోరు, కానీ రంభ మాత్రం మిస్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం గా ఉంది. ప్రస్తుతం ఆమె వయస్సు 47 సంవత్సరాలు.

ఈ వయస్సు లో ఆమెకి హీరోయిన్ రోల్స్ దక్కడం అసాధ్యం. రమ్యకృష్ణ లాగ ముఖ్యమైన, శక్తివంతమైన పాత్రలు పోషించే ఛాన్స్ ఉండొచ్చు. రీ ఎంట్రీ తర్వాత ఆమె డిమాండ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే రంభ కి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు. పెద్ద కూతురు పేరు సాష , చిన్న కూతురు పేరు లావణ్య. పెద్ద కూతురు కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మోడరన్ డ్రెస్ లో కనిపిస్తున్న ఈమె రంభ కంటే పొడవుగా ఎదిగిపోయింది. ఆమె ఫోటోని మీరు కూడా ఈ క్రింది చూసేయండి.

4066 views