Pragathi: ఆ నటుడు మిస్ బిహేవియర్.. ఆ తరువాత ప్రగతి చేసిన పనికి షాక్..

Posted by venditeravaartha, June 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమాల్లో నటించే కొందరు స్టార్లు కాకపోయినా వారికి ప్రత్యేక గుర్తింపు వస్తుంటుంది. తెలుగు సినిమాల్లోని చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాలతో సంబంధం లేకుండా స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. తల్లిగా.. అత్తగా.. వదినగా ఎన్నో సినిమాల్లో అలరించి ఆకట్టుకున్న ప్రగతిని ఎవరూ మరిచిపోరు. ఆమె చేసే యాక్టింగ్ చూసి ఇలాంటి క్యారెక్టర్ మన ఇంట్లో ఉంటే బాగుండు.. అనిపిస్తుంది. అయితే ప్రగతి సినిమాల్లో సాఫ్ట్ గా కనిపించినా.. రియల్ గా మాత్రం చాలా రఫ్ గా ఉంటారు. ఇప్పటికే ఆమె జిమ్ చేసిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Actress-Pragathi-shocking-comments-goes-viral-

‘చిరత’ అనే సినిమాలో రామ్ చరణ్ తల్లిగా నటించినా ప్రగతి అప్పటి నుంచి పలు సినిమాల్లో వరుసగా అవకాశం తెచ్చుకుంటున్నారు. ప్రగతి నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఈమె సినిమాల్లో కంటే రియల్ గానే ఫేమస్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. లేటేస్టుగా ఓ నటుడి గురించి ప్రగతి హాట్ కామెంట్ చేశారు. తనతో ఓ కమెడియన్ మిస్ బిహేవియర్ చేసినట్లు అనిపించిన విషయం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఓ సినిమాలో నటిస్తున్న సందర్భంగా ఓ స్టార్ కమెడియన్ తనతో మిస్ బిహేవియర్ చేశారట. అయితే అయన అలా చేయడం వల్ల ప్రగతి మనస్థాపం చెందింది. అయనలా ఎందుకు చేశాడని అర్థం కాలేదు. ఉదయం 11 గంటలకు జరిగిన ఈ సంఘటనతో పొద్దంతా అదే మనసులో ఉండిపోయింది. దీంతో తీవ్రంగా అప్ సెట్ అయిన ప్రగతి ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చాలని అనుకుంది. దీంతో షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత సదరు కమెడియన్ ను కలిసింది.

ఆయన చేతిని పట్టుకొని క్యార్ వాన్ లోకి తీసుకెళ్లిన ప్రగతి మీరలా ఎందుకు బిహేవ్ చేశారు? మీతో నేనేమైనా అసభ్యంగా ప్రవర్తించానా? నాలో ఏదైనా తప్పుంటే క్షమించండి.. అంటూ ప్రగతి అతనికి చెప్పింది. దీంతో వెంటనే ఆ కమెడియన్ .. అయ్యో.. అలా అంటున్నావేంటమ్మా.. నేనేమీ అలా చేయలేదు. నా ప్రవర్తనే ఏమైనా తప్పుగా ఉంటే మన్నించు.. అని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంఘటనలు ఇలా షాక్ ను తెప్పిస్తాయని అని ప్రగతి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది.

Tags :
2211 views