Nagarjuna: రవితేజ నిర్మాత తో కొట్లాటకు దిగిన నాగార్జున..విషయం ఇంత దూరం వెళ్లిందా!

Posted by RR writings, October 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. వయసు మీద పడుతున్నప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇటీవల ఆయన జోరు కాస్త తగ్గింది. ఆయన లాస్ట్ మూవీ ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇటీవల ఆయన ‘నా సామిరంగ’ టైటిల్ తో ఓ మూవీని ఆనౌన్స్ చేశారు. ఈ సినిమా విషయంలో పెద్ద రచ్చే జరిగిందిని ఫిలీం నగర్లో చర్చ జరిగింది.

వాస్తవానికి ఈ మూవీని నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేయాల్సిందట. కానీ ప్రస్తుతం ఆయన రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సందర్భంలో ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘నా సామిరంగ’ మూవీ మలయాళ సూపర్ హిట్ ‘పోరింజు మరియం జోస్’కి రీమేక్ గా తెరకెక్కుతుందని టాక్ నడుస్తోంది. ఈ విషయం అధికారికంగా మేకర్స్ తెలియచేయలేదు. ఈ సినిమా రీమేక్ హక్కులు అభిషేక్ అగర్వాల్ దగ్గర ఉన్నాయి.

ఈ కథతోనే మన్మథుడు నాగార్జున వేరే నిర్మాతలతో నా సామిరంగ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ విషయాన్ని సన్నిహిత వర్గాల ద్వారా తెలుసుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఆ మధ్య ఓ ప్రకటన కూడా చేశారు. ఆ మూవీ రీమేక్ హక్కులు తమ దగ్గర మాత్రమే ఉన్నాయన్నారు. ఆ తరువాత నాగ్ సినిమా నిర్మాతలు, అభిషేక్ అగర్వాల్ మధ్య చర్చలు జరగడంతో.. గొడవ సమసిపోయి నా సామిరంగ సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయట. కాగా నా సామిరంగ సినిమాని మరో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ ఓ కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. నాగ్ సరసన హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా నిర్మితమవుతుంది. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

298 views