Konda valasa: కమెడియన్ కొండా వలస గుర్తు ఉన్నాడా..? ఇతని ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

Posted by venditeravaartha, March 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాల మంది యాక్టర్ లు తమ సినీ కెరీర్ మొదట్లో మంచి పేరు ,డబ్బులు సంపాదించి చాల సంపన్నులు గా వెలుగొంది , కెరీర్ చివర్లో అవకాశాలు లేక ,డబ్బులు పోగొట్టుకుని, బంధువులు కి దూరమయ్యి అనాధలుగా జీవించారు, ఎక్కువ గా ఈ జాబితా లోకి క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ,కమెడియన్ లు వస్తారు ,ఇప్పుడు అదే పరిస్థితుల లో ఉన్నారు ఒక కమెడియన్ ఫ్యామిలీ. ఆ కమెడియన్ ఎవరో కాదు ‘కొండవలస ‘ గారు.

కొండవలస లక్ష్మణరావు గారు 1946 సంవత్సరం , ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం లో జన్మించారు ,తన పూర్తి పేరు చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు ,తెలుగు సినిమా ప్రేక్షకుల కి ‘కొండవలస ‘ గా బాగా పాపులర్ అయ్యారు. 56 సంవత్సరాల వయస్సు లో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టారు. సినిమా లోకి రాకముందు కొండవలస గారు విశాఖ పట్టణం పోర్ట్ లో పనిచేసే వారు , అక్కడ పని చేస్తూనే 1000 కి పైన స్టేజి నాటకాలు వేశారు.

2002 లో రిలీజ్ అయినా వంశి గారి డైరెక్షన్ లో వచ్చిన ‘అవును వాళ్లిదరు ఇష్టపడ్డారు !’ సినిమా ద్వారా కొండవలస గారు తెలుగు సినీ పరిశ్రమ కి పరిచయం అయ్యారు , ఆ సినిమా లో ‘పొట్టి రాజు ‘ క్యారక్టర్ లో మంచి కామెడీ పండించారు. తన మొదటి సినిమా తోనే మంచి పేరు ,తన కంటూ ప్రత్యేక పాత్రా ఉండేలా చేసుకున్నారు, ‘అయితే ఓకే ‘ అనే పదం తో ప్రత్యేక శైలి ని చూపారు.

తన తోటి కమెడియన్ లు అయినా ‘బ్రహ్మానందం’,’కృష్ణ భగవాన్ ‘,’ఏ వి ఎస్ ‘,’ఏం ఎస్ నారాయణ’ ,ధర్మవరపు సుబ్రహ్మణ్యం మొదలగు వారితో పాటు కొండవలస గారికి కూడా ప్రత్యేక మైన పాత్రా ల ను రచయత లు రాసేవారు, అందులో తన కి బాగా పేరు తెచ్చిన ‘అవును వాళ్లిదరు ఇష్ట పడ్డారు ‘,’కబడ్డీ కబడ్డీ ‘,’ఎవడి గోల వాడిదే ‘,’బ్లేడ్ బాబ్జి ‘,’బెండు అప్పారావు ‘,’శ్రీ కృష్ణ 2006 ‘, దాదాపు 65 కి పైన సినిమా ల లో నటించారు, 2015 లో రిలీజ్ అయినా అల్లరి నరేష్ గారి ‘జేమ్స్ బాండ్ ‘
సినిమా తన కెరీర్ లో చివరి సినిమా. అనారోగ్య సమస్యల తో 2015 నవంబర్ లో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మరణించారు.


కొండవలస గారి మరణం తో వాళ్ళ ఫ్యామిలీ ఒక్క సరిగా దిక్కు తోచని పరిస్థితులో కి వెళ్లి పోయింది, కొండవలస గారికి ఒక కొడుకు ,కూతురు ఉన్నారు , కూతురు అమెరికా లో పెళ్లి చేసుకుని అక్కడే ఉంటారు , కొడుకు తెలుగు పరిశ్రమ లోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసే వారు ,అయన చనిపోయాక వాళ్ళ పరిస్థితి అంత మరి పోయింది , సినిమా ల లో అవకాశాలు రాక కొండవలస గారి అబ్బాయి ఇబ్బందులుపడుతున్న సమయం లో కమెడియన్ లు కొన్ని రోజులు సపోర్ట్ ఇచ్చినప్పటికీ అయన లేని లోటు వాళ్ళకి స్పష్టం గా తెలుస్తుంది.హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్మేసి ,ఫిలిం నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయినా ఉన్న రోజుల్లోనే ఎంతో కొంత దాచి పెట్టి ఫ్యామిలీ మెంబెర్స్ కి సపోర్ట్ అయ్యేలా చేసుకోవాలి అని ఇలాంటివి చూసినపుడు తెలుస్తుంది.

690 views