రవితేజతో సినిమా పై క్లారిటీ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ – ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాలు!

Posted by venditeravaartha, October 14, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ‘తెలుసు కదా’ సినిమా అక్టోబర్ 17, 2025న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధు ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దీపావళి సీజన్‌లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండగా, పోటీపై స్పందించిన సిద్ధు


“రిస్క్‌ ఉన్నచోటే విజయముంటుంది. నా గత చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ ఒక సినిమా నన్ను కింద పడేస్తే, మరొకటి నన్ను టాప్‌లో నిలబెడుతుందని నమ్ముతాను,” అని చెప్పుకొచ్చాడు.

లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రొమాన్స్ అంశంపై మాట్లాడుతూ సిద్ధు
“ఇది ఫ్యామిలీ మూవీ. కథ మొదట చెప్పినప్పుడే డైరెక్టర్ నీరజ కోనకు నేను కండీషన్ పెట్టాను – ఒక్క ముద్దు సీన్‌ కూడా ఉండకూడదు. లవ్ స్టోరీకి తగిన భావోద్వేగాలను చూపించాం,” అని వివరించాడు.

రవితేజతో కలిసి సినిమా చేసే అవకాశం గురించి అడిగినప్పుడు సిద్ధు –
“మేం గతంలో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేశాం కానీ అది ఆగిపోయింది. సరైన కథ దొరికితే తప్పకుండా మల్టీస్టారర్‌ చేస్తాం,” అని క్లారిటీ ఇచ్చాడు.

109 views