Prabhas: ప్రభాస్ కి పెద్ద తలనొప్పిగా మారిన తేజ తేజ్జ..పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు!

Posted by venditeravaartha, July 30, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Prabhas: బాలనటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల అశేష ఆదరణ దక్కించుకున్న తేజ సజ్జ, ఇప్పుడు హీరోగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ గా ఎదిగే కుర్ర హీరోగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం ద్వారా ఆయన ఏ స్థాయి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడో మనమంతా చూసాము. ఈ చిత్రానికి పోటీ గా దిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కొట్టుకొనిపోయింది. అలాంటి సంచలన విజయం తర్వాత, అంతకు మించి హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు తేజ సజ్జ.

ఈసారి ఆయన ‘మిరై’ అనే పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రం లో మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. సినిమాకి సంబంధించిన మెయిన్ టీజర్, అలాగే మనోజ్ కి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే ఈ చిత్రం కూడా సూపర్ హీరో నేపథ్యం లో తెరకెక్కుతున్న చిత్రమని ఆడియన్స్ కి అర్థం అయిపోయింది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ మూడవ వారం లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారట. నిన్ననే ప్రభాస్- మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ చిత్రం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల కాబోతుందని టీజర్ ద్వారా అధికారిక ప్రకటన చేసారు.

ఇప్పుడు ఈ సినిమా విడుదలైన పక్క వారం ‘మిరై’ చిత్రం విడుదల అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రానికి కాస్త నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కాస్త ఏమాత్రం తేడా అయినా ‘మిరై’ చిత్రం ‘రాజా సాబ్’ కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతుందని, 2024 సంక్రాంతికి జరిగిందే రాజా సాబ్ కి కూడా జరుగుతుందని అంటున్నారు. మరి విడుదల సమయానికి తేజా సజ్జ ‘మిరై’ మూవీ మేకర్స్ ప్రభాస్ ని గౌరవిస్తూ పోటీ నుండి తప్పుకుంటున్నారు లేదా ప్రభాస్ తో సై అంటే సై అని తలపడుతారా అనేది చూడాలి.

547 views