OG: పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులకు స్వర్ణ యుగం మొదలైంది అనే చెప్పాలి. సోషల్ మీడియా లో ఒక అభిమాని చెప్పినట్టు, పీల్చే గాలిలో కూడా పవనిజం ఉంటుంది అనే రోజులు వచ్చేసాయి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశ రాజకీయ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్నీ స్థానాల్లో ఘనవిజయం సాధించి రాష్ట్రంలో జనసేన పార్టీ ని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టాడు పవన్ కళ్యాణ్. అలాగే ఢిల్లీ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్రని పోషించాడు. రాజకీయంగా ఈ స్థాయి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్, రాబొయ్యే సినిమాలతో కూడా అదే రేంజ్ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయన క్రిష్ తో హరి హర వీరమల్లు, సుజిత్ తో ఓజీ, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ సగం పూర్తి అయ్యాయి, మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా ఆగాయి. ఇప్పుడు ఎన్నికల సందడి మొత్తం పూర్తి అవ్వడం తో జూన్ 15 వ తేదీ నుండి ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ నుండి ఓజీ చిత్రం విడుదల అవుతుందని అందరు అనుకున్నారు. సెప్టెంబర్ 27 వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేసారు. అయితే ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 27 నుండి వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ఏడాది కాకుండా, వచ్చే ఏడాది విడుదల చేస్తే 96 కోట్ల రూపాయిలను ఇస్తామని చెప్పగా, దానికి మేకర్స్ ఒప్పుకొని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చెయ్యబోతున్నారు.
దీంతో ఇప్పుడు ఓజీ చిత్రానికి బదులుగా, హరి హర వీరమల్లు చిత్రం ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యకపోయినా కూడా, అక్షరాలా 96 కోట్ల రూపాయలకు ఓజీ చిత్రాన్ని నెట్ ఫ్లెక్స్ సంస్థ కొనుగోలు చేసిందంటే, ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలు కారణంగా ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇప్పుడు ఓజీ చిత్రం విడుదలైతే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.