Karthika Deepam 2 : పారిజాతం ప్లాన్.. ఇంట్లో నుంచి బయటకు దీప.. అడ్డుపడ్డ కార్తీక్..

Posted by uma, April 9, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Karthika Deepam 2 : కార్తీకదీపం 2 మొదలైనప్పటినుండి ఆధ్యాంతం ఊహించని మలుపులతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో, దీప కార్తిక్ వాళ్ళింటికి రావడం జోస్నా దగ్గర ఉండి దీప ని ఇంటికి తీసుకురావడం, దీప అది కార్తీక్ ఇళ్లని తెలియక, జోష్నా అమ్మని కాపాడినందుకు వాళ్ళు కృతజ్ఞతతో, దీప బయట ఉంటే ఇంకేమైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఎంక్వయిరీ అయిపోయేదాకా వాళ్ళ ఇంట్లో ఉండమని తీసుకొస్తారు. పారిజాతం దీపని చూసి కంగారు పడుతుంది. దీపా అనుకోకుండా కార్తీక్ ని అదే ఇంట్లో చూస్తుంది. కార్తీక్ దీప ని చూసి, ఎలాగైనా దీపకు నిజం చెప్పాలనుకుంటే దేవుని నాకొక అవకాశం ఇచ్చాడని అందుకే దీపని మా ఇంటికి తీసుకువచ్చాడని ఇక దీప వెళ్లే లోగా తనకి నిజం చెప్పాలని అనుకుంటాడు. కార్తీక్ యాక్సిడెంట్ చేయడం వల్ల దీప తండ్రి చనిపోతాడు. దాంతో దీప కార్తీక్ మీద కోపం పెంచుకొని ఉంటుంది కార్తీక్ ఆ తప్పు నేను చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా,దీప నేను నమ్మడం లేదు బాబు అని అంటుంది దాంతో కార్తీక్ ఒక అవకాశం వచ్చినట్లు అయింది దీపా అదే ఇంట్లో ఉంటే కార్తీక్ నిజం చెప్పి, దీప మనసు మార్చు అని అనుకుంటాడు. ఇక మరోవైపు కార్తీక్ పేరెంట్స్, జోస్నా ని కార్తీక్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కార్తీక్ మాత్రం జోష్ణ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని పారిజాతంతో నిజం చెప్పేస్తాడు కానీ పారిజాతం ప్లాన్ ప్రకారం జోస్నకు కార్తీకు పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. పారిజాతం నమ్మినబంటు సుమిత్రకు ప్రమాదం జరిగేలా చేస్తాడు దాంతో పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీకే ప్రమాదం అమ్మ అని పారిజాతాన్ని బెదిరిస్తాడు మీ కోసమే నేను తప్పు చేశాను కాబట్టి నాతోపాటు మీరు జైలుకు రావాల్సి ఉంటుంది అని చెప్తాడు దాంతో పారిజాతం కూడా కంగారుపడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో, పారిజాతంమనిషి బంటు పారిజాతం దగ్గరికి వెళ్లి అమ్మ నేను ఇప్పుడు ఒక సంఘటన చూశాను,గుడిలో ఆరోజు సుమిత్ర మని కొట్టబోతే కాపాడిన అమ్మాయి ఇక్కడ ఉందేంటి అని అడుగుతాడు దాంతో పారిజాతం విషయం మొత్తం చెబుతుంది బంటు ఆ అమ్మాయి నన్ను చూసిందేమోనని అనుమానంగా ఉందమ్మా అని అంటాడు. అంత చావు కబురు చల్లగా చెప్తావ్ ఏంటి అని పారిజాతం కోప్పడుతుంది ఏమోనమ్మా మీరే ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్లేలా చేయండి లేదంటే ఆ అమ్మాయి నన్ను చూసి గుర్తుపడితే నాతో పాటు మీరు జైలుకు రావాల్సి ఉంటుందని బంటు పారిజాతాన్ని బెదిరిస్తాడు. దాంతో పారిజాతం బాగా ఆలోచించి దీప దగ్గరికి వెళ్తుంది. దీప ఎదురుగా ఉన్న అవుట్ హౌస్ లో ఉంటుంది. సౌర్య నీ పడుకోమని చెప్పి దీప టాబ్లెట్స్ వేసుకోవడానికి బయటకి వస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం దీపని అవమానించేటట్లు మాట్లాడుతుంది ఎలాగైనా దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేయాలని పారిజాతం గట్టిగా ఫిక్స్ అవుతుంది. నువ్వు ఎక్కడికి ఏమీ లేకుండా వచ్చావని నాకు తెలుసు అసలు మీ ఊరు ఏది అని అడుగుతుంది అందుకు దీప సమాధానం చెప్పదు ఆత్మ అభిమానం కలిగిన ఆడవాళ్లు ఇంకొకరి పంచనా ఉండరు కానీ నువ్వు ఉంటున్నావంటే దానికి ఇంకో కారణం ఉండి ఉంటుంది అది నీ భర్త వదిలేయడం అయినా అయి ఉండాలి ఇంతకీ నీ భర్త ఎవరు అని అడుగుతుంది. ఉన్నాడా లేక వదిలేసాడా అని, అయినా మీలాంటి వాళ్ళు పట్నం వచ్చేది మాలాంటి గొప్ప ఇంట్లో పని చేయడానికి కదా అని అంటుంది దాంతో దీపా కోపంగా నేను ఆ పని కోసం రాలేదమ్మా అని అంటుంది అయినా నీకెందుకులే అలాంటి పనులన్నీ ఒకటి రెండు ఇలాంటి ఇల్లు చూసుకొని అక్కడ ఒక ముద్ద ఇక్కడ ఒక ముద్ద తింటే మీకు రోజు గడిచిపోతుంది కదా అని హేళనగా మాట్లాడుతుంది దాంతో దీపా నా పరిస్థితి గురించి మీకు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అడుగుతుంది పారిజాతం ని, ఇక పారిజాతం నువ్వు సుమిత్రాన్ని కొట్టిన వాళ్ళని చూశావా వాళ్ళని గుర్తుపడతావా అని అడుగుతుంది ఆ చూశాను కానీ నాకు ఇప్పుడైతే ఏం గుర్తులేదు అమ్మ ఇంకొకసారి చూస్తే గుర్తుపడతాను అని అంటుంది. దాంతో పారిజాతం అమ్మో ఈ దీప ఉండడం చాలా ప్రమాదం అని మనసులో అనుకుంటుంది నీకు ఆత్మాభిమానం ఉంటే నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే ఉండొచ్చు ఆ తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు అని దీపా అంటే నా కోడలికి ప్రమాదం జరిగితే నేను కనుక్కోకుండా ఎవరు కనుక్కుంటారు అని దీపకి చెప్పేసి వెళ్లిపోతుంది.

ఇక బాగా ఆలోచించి దీప ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనుకుని కూతుర్ని నిద్రలేపి తను తీసుకొని బయటికి వెళుతూ ఉంటే అప్పుడే కార్తీక్ వాళ్ళ అత్త సుమిత్రికి చెప్పి ఇంటికి వెళ్లి డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకొని వస్తాను అత్త అని అంటాడు దాంతో తొందరగా వచ్చేసేయ్ అని అంటే ఈ ఇల్లే మా ఇల్లు లాగా అయిపోయింది అత్త మాకంటూ ఒక ఇల్లు ఉన్నా కానీ మా అమ్మ నాన్న ఇక్కడే సెటిల్ అయిపోయారు. అని అంటాడు. దాంతో సుమిత్ర తప్పేముంది అందరం ఒక చోట ఉండాల్సిన వాళ్ళమే కదా రేపు నీకు పెళ్లి అయితే నీ కొడుకు కూడా ఇక్కడే ఉంటాడు కదా అని అంటుంది. దాంతో కార్తీక్ టాపిక్ డైవర్ట్ చేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్లి వస్తాను అత్త అని బయటకు వస్తూ ఉంటాడు. ఇక త్వరగా వచ్చేయండి సుమిత్ర ఇక బయటికి వెళ్లిన కార్తీక్కి దీప , సౌర్య ఇద్దరు బయటికి వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే వెళ్లి ఆపుతాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది చెప్పాల్సిన అవసరం కాదండి ఇది నా బాధ్యత మీరు ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కోవాలి ఇంత రాత్రి పూట వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అంటే, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది దీప. అయితే మీరు మా అత్తతో చెప్పి వెళ్ళండి మా అత్తకి ఫోన్ చేస్తాను అని అంటాడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు బాబు అని అంటుంది అసలు మీరు సిటీకి ఎందుకు వచ్చారు అని కార్తీక్ అడుగుతాడు దానికి దీప సమాధానం చెప్పకుండా ఉంటే పక్కనే ఉన్న సౌర్య మా నాన్న కోసం వచ్చాము అని అంటుంది దాంతో దీప సౌర్య మీద కోప్పడుతుంది. మీరు చెప్పరు చెప్పే పాపని ఆపేస్తారు ఏంటి అని అంటే మీకు తెలియాల్సిన అవసరం లేదు బాబు మా బతుకులు మావి అని అంటుంది దీప సరే ఇప్పుడైతే మాత్రం నేను దాని గురించి అడగను కానీ మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని కార్తీక్ దీప ని ఆపుతాడు. మీరు వెళ్లాలనుకుంటే మా అత్త కి చెప్పేసి వెళ్ళండి లేదంటే లోపలికి వెళ్ళండి అని అంటాడు. చేసేదేం లేక దీప లోపలికి వెళ్ళిపోతుంది.

ఇక ఉదయాన్నే శౌర్య, గార్డెన్ లో చాలా పూలు చూసి ఆ పూలను కోదాం అని అనుకొని అంతలో ఒకసారి పూలు కోసి గొడవేనా విషయం గుర్తుకు వచ్చి పూలు పోయకుండా ఆగిపోతుంది అదంతా చూసిన పారిజాతం ఈ బుడ్డది ఇక్కడే ఉందంటే రాత్రి నేను అన్న మాటలకు దీపం ఇంట్లో నుంచి వెళ్లిపోలేదన్నమాట లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఎవరైనా ఆపారా అని అనుకొని, అప్పుడు వెళ్లకపోతే నేను ఇప్పుడు వెళ్లేలా చేస్తాం కదా అని సౌర్య దగ్గరికి వస్తుంది. ఏంటే పూలుకొస్తున్నావా అని గొడవ పెట్టుకోవాలనుకుంటుంది అంతలో శౌర్య పూలు కొస్తేనే గొడవ జరుగుతుంది అనుకున్నా పూలు చూస్తేనే గొడవ జరుగుతుంది అన్నమాట అని అంటుంది. వేలేదంతా లేవు నన్నే ఎదురించి మాట్లాడుతున్నావా అని కొట్టబోతుంది పారిజాతం సౌర్య అమ్మ అని అరుస్తుంది అటుగా వెళుతున్న కార్తీక్ పారు అని గట్టిగా అరుస్తాడు దాంతో పారిజాతం కార్తీక్ ని చూసి సైలెంట్ గా ఉంటుంది దాంతో కార్తీక్ ఏంటి నీ ప్రతాపం పిల్లల మీద చూపిస్తున్నావా అని అంటే లేదు పూలు కొయిస్తుందేమోనని అని అంటుంది పూలుకొస్తే ఏమైంది చూడు సౌర్య ఇక్కడ ఉన్న పూలు నీకు ఎన్ని కావాలంటే అన్ని కోసుకో ఇంట్లో ఎవరూ నేనేమీ అనడు నేను చెప్తున్నాను కదా అని అంటాడు. ముందు వచ్చిన వాళ్లకు వెనక వచ్చిన వాళ్లకు విలువ ఎక్కువ ఇస్తున్నావని కార్తీక్తో అంటుంది. ఆ మాటలకు సౌర్య అమ్మా ఈ ఊర్లో పూలు కొస్తేనే గొడవ జరుగుతుంది అనుకున్నాను. ఏమి చేయకపోయినా గానీ ఇంత పెద్ద గొడవ జరిగిందంటే మేము ఊర్లో ఉండము అని చెప్పి సుమిత్రికి చెప్పి వెళ్ళిపోతాము అని అమ్మమ్మ దగ్గరికి వెళ్లి అమ్మమ్మతో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అంటుంది దాంతో పారిజాతం హమ్మయ్య వీళ్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మనకు కావాల్సింది అని అనుకుంటుంది. ఇక అక్కడే ఉన్న కార్తీక్ చూశావా నీవల్ల పిల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది అసలు ఎవరికి చెప్పాలి వాళ్ళకే చెప్పడానికి వెళ్ళింది. ఇక చూసుకో మరి నీ గురించి నువ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పారిజాతం అవును ఇదిసుమిత్ర కి చెప్పడానికి వెళ్ళింది ఇప్పుడు సుమిత్ర నామీద ఏం కోప్పడుతుందో ఏంటో అని మనసులో అనుకుని, సౌర్య వెనకాలే వెళుతుంది. అప్పటికే శౌర్య సుమిత్ర దగ్గరికి వెళ్లి అమ్మమ్మ మేము ఊర్లో ఉండడం లేదు ఇకనుంచి వెళ్ళిపోతాము అని అంటే దేనికి అని అంటే, ఇక్కడ పూలు చూస్తే కూడా గొడవలు జరుగుతున్నాయి అని అంటుంది అక్కడికి వచ్చిన పారిజాతం,అదేంటి ఇక్కడ ఉన్నావు వెళ్ల పూలు కోసుకో పాప అని అంటుంది అదేంటి ఇప్పుడేగా మీరు బయట నాతో గొడవ పడ్డారు అని అంటే వెంటనే పారిజాతం వైపు కోపంగా చూస్తుంది సుమిత్ర,అదేం లేదమ్మా పూలు కొస్తే నీ చేతిలో నొప్పి పెడతాయని అలా అన్నాను అని అంటుంది వెంటనే అదే లేదండి అని సౌర్య ఈవిడ అని చెప్పబోతుంటే వెంటనే పారిజాతంఅది కాదు సుమిత్రా చిన్న పిల్ల కదా అని అంటే నాకు అంత అర్థమైంది అత్తయ్య మీకు ఎవరు కూడా మీరు కాపాడుకోండి వీళ్ళు నాకోసం మా ఇంట్లో ఉంటున్నారు మీరు మాత్రం వాళ్ళని ఏమీ అనడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది ఈ బుడ్డది ఎంత పని చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సడన్గా పంటూ ఎంట్రీ ఇస్తాడు ఒరేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఇలా చేయడం వద్దని ఏదో కొంప కాలిపోతున్నట్టు ఆ హడావిడిగా వస్తావు ఏమైంది అని అడిగితే అమ్మ బయటకు గెస్ట్ లో వచ్చారమ్మా అని అంటాడు బెస్ట్ లో వచ్చారా అది ఇంత చిన్నగా చెప్తావ్ ఏంట్రా ఏదేదో ముందే చెప్తే కాస్త నీటుగా మేకప్ వేసుకొని వస్తాను కదా అని అంటుంది భార్యతో వచ్చింది ఇంతకీ ఎవరు రా అని అడుగుతుంది పోలీసులమ్మ అని అంటాడు. వరి వెధవ పోలీసులు వస్తే ఎంత చిన్నగా చెప్తావ్ ఏంట్రా ఎవరు మన ఇంటికి ముత్తయిదులు వచ్చినట్టు ఇంత తిన్నగా చెప్పావు అసలు నువ్వు ఉన్నావు చూడు అని పారిజాతం బంటును తిట్టుకుంటూ బయటికి వెళుతుంది . బయటపడితే దీపా కార్తీక్ సుమిత్ర పోలీసులు అందరూ నుంచుని ఉంటారు పోలీసులు కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి వాళ్ళల్లో నువ్వుగుళ్లో చూసిన వాళ్ళు ఉన్నారేమో కనిపెట్టమని దీపక చెప్తారు దీప అందరిని చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న బంటు పారిజాతం ఇద్దరు కంగారుపడుతూ ఉంటారు. దీపందని చూసి వీళ్ళు ఎవరూ లేరండి అని అంటుంది సరిగ్గా చూడు దీపా అని అంటే పోలీసులు లేదు మేడం ఖచ్చితంగా వీళ్ళు ఎవరు లేరు నాకు ఆ కొట్టిన వాడు బాగా గుర్తున్నాడు అని అంటుంది. ఇక పారిజాతం మనసులో ఆ కొట్టినవాడు గుర్తుంటే వాన్ని పట్టుకొని వాడి వెనకాల ఉన్నవి అన్ని బయటికి లాగుతారు వీటి వెనకాల ఉన్న నన్ను బయటికి లాగుతారు ఇక అందరం జైలుకు వెళ్లాల్సిందే అని అనుకుంటుంది. ఇక సుమిత్ర మేడం ఎలాగైనా సరే ఆ కొట్టిన వాడిని మీరు కనిపెట్టి తీరాలి వాడి దొరికితేనే కదా వాడి వెనకాల ఎవరైనా తెలిసేది అని అంటాడు కార్తీక్. సరే మేడం మా ప్రయత్నం ఏం చేస్తాము అని పోలీసులు వెళ్ళిపోతుంటే అక్కడే ఉన్న దీప మేడం మిమ్మల్ని ఒకటి అడగాలి అని అంటుంది. ఎస్ఐ గారు ఏంటో చెప్పమ్మా అని అంటుంది దానికి దీపా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అండి అని ఉంటుంది సుమిత్ర అదేంటి నాకు చెప్పకుండా ఎలా వెళ్తావు అని అంటుంది.పోలీసులతో దీప మీరు చెప్పండి అండి నేను ఇకనుంచి వెళ్ళిపోతాను అంటుంది దాంతో పోలీసులు మీరు ఐ విట్నెస్ మేడం ఈ కేసులో మీరు వెళ్లిపోతే ఎలాగ మీరే కదా గుర్తుపట్టాల్సింది నేరస్తుల్ని అని, మీకు అంతగా ఇబ్బంది అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నది ఫోన్ నెంబరు అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అని అంటే సుమిత్ర అవసరం లేదు మేడం ఆ అమ్మాయి నా బాధ్యత మీరు వెళ్ళండి అని అంటుంది. ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తావు దీపఅని సుమిత్ర అడుగుతుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

858 views