Karthika Deepam : కార్తీకదీపం నుంచి సరికొత్త ప్రోమో చూశారా.. వంటలక్క మళ్లీ వచ్చేస్తోంది

Posted by RR writings, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Karthika Deepam : సినిమాలకు సీక్వెల్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారాయి. ఒక సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్స్‌ని ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు దర్శకనిర్మాతలు. కానీ సీరియల్‌కి సీక్వెల్ రావడం చాలా అరుదు అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ త్వరలో రాబోతోంది. ఈ సీక్వెల్ టైటిల్‌ను సీరియల్ యూనిట్ వెల్లడించింది. కార్తీక దీపం ఈ సీక్వెల్‌కి ఇది నవ వసంతం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కార్తీక దీపం నవసంతం ప్రోమో విడుదలైంది. తెలుగు లోగిల్లు మరువని కథ మళ్లీ కొత్త వెలుగులతో రాబోతోందని ఈ ప్రోమోలో సీక్వెల్ గురించి మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రోమోలో శౌర్య పాత్రను మాత్రమే చూపించారు.

బుల్లితెరపై ప్రసారమై ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. ఈ సీరియల్‌ లో నటించిన వాళ్లంతా తమ నటనతో ప్రతి ఒక్క హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సీరియల్లో వంటలక్క పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్​ మనందరికీ సుపరిచితమే. అదేవిధంగా డాక్టర్ బాబు పాత్రలో నిరూపమ్ నటించగా విలన్ పాత్రలో మౌనిత అలియాస్ శోభా శెట్టి నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ రానున్నట్లు అప్పట్లోనే కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా మరో ప్రోమో రిలీజ్ చేశారు ఈ సీరియల్ టీం. ఇక ఇందులో ఈసారి కొత్త నేపథ్యంలో రానున్నట్లు ఈ ప్రోమోలో అర్థమైంది. నిరుపమ్ దగ్గర పని చేసే వంట మనిషిలాగ దీప కనిపించగా ఆమె కూతురు శౌర్య తన తండ్రి కోసం ఎదురుచూసే పిల్లలాగా కనిపించింది. దీన్ని బట్టి చూస్తుంటే మొదటి పార్టు కార్తీకదీపం సీరియల్ ను మించిపోయేటట్లు కనిపిస్తుంది. మరి ఈ సీరియల్ ఎప్పటినుంచి ప్రసారం అవ్వుద్దో ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు.

ప్రోమోలో.. నాకు చీక‌టి అంటే భ‌యం…ఈ చీక‌టిలో నాకు ధైర్యాన్ని ఇచ్చే వెలుగు మా అమ్మ‌. క‌ష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్క‌డున్నాడో తెలియ‌దు. కానీ అమ్మైనా నాన్నైనా…నాకు మా అమ్మే. ఇంత‌కీ నా పేరు ఏంటో తెలుసా శౌర్య‌. ఇప్పుడు నేను చెప్ప‌బోయేది మా అమ్మనాన్న‌ల క‌థ అంటూ శౌర్య చెప్పిన డైలాగ్స్ ప్రోమోలో ఆక‌ట్టుకుంటున్నాయి. త్వ‌ర‌లోనే స్టార్ మా ఛానెల్‌లో కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం సీరియ‌ల్ టెలికాస్ట్ మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం. కార్తీక దీపం కొత్త సీజన్లో డాక్టర్ బాబు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . కార్తీక దీపం సీరియల్ దాదాపు ఆరేళ్ల పాటు 1569 ఎపిసోడ్లతో ప్రసారం చేయబడింది. తెలుగులో అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్ తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీతో పాటు అనేక భాషల్లోకి డబ్ చేయబడింది.

495 views